పొత్తు లేదు

30 Aug, 2015 04:52 IST|Sakshi
పొత్తు లేదు

- బీబీఎంపీ మేయర్ ఎంపికపై ఎవరితోనూ మైత్రి ప్రస్తావనే లేదు
- స్పష్టం చేసిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
సాక్షి, బెంగళూరు:
బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) మేయర్ సీటు కోసం తాము ఎవరితోనూ పొత్తులు పెట్టుకునే ప్రస్తావనే లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. బీబీఎంపీ ఎన్నికల్లో కొత్తగా ఎంపికైన కార్పొరేటర్‌లతో శనివారమిక్కడి పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్‌తో కలిసి సీఎం సిద్ధరామయ్య పాల్గొన్నారు. మేయర్ ఎంపిక పూర్తయ్యే వరకు నగరాన్ని వీడి ఎక్కడికీ వెళ్లవద్దని కొత్తగా ఎంపికైన కార్పొరేటర్‌లకు ఈ సమావేశంలో సిద్దరామయ్య సూచించినట్లు సమాచారం. అంతేకాక ఎన్నికల సమయంలో పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఆయా వార్డుల్లో కార్పొరేటర్లు శ్రమిం చాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉం డాలని మార్గనిర్దేశనం చేశారు.

ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను సైతం ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కోరారు. ఇక సమావేశానికి ముందు సీఎం సిద్ధరామయ్య విలేకరులతో మాట్లాడుతూ....బీబీఎంపీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ శిరసావహిస్తుందని తెలి పారు. మేయర్ సీటు కోసం ఎవరితోనూ పొత్తు కు దుర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని అన్నా రు. అనంతరం కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్ మాట్లాడుతూ... బీబీఎంపీ ఎన్నికల్లో మైత్రికి సంబంధించి చర్చలు జరిపేందుకు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఎవరికీ అనుమతి ఇవ్వలేదని అన్నారు. అయినా పార్టీ అనుమతి లేకుండానే మైత్రి చర్చలు జరిపిన నాయకుల నుంచి వివరణ కోరనున్నట్లు పరమేశ్వర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ జేడీఎస్‌తో పొత్తు కుదుర్చుకోనుందనే వ్యాఖ్య లు సత్యదూరమని స్పష్టం చేశారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సీఎం జగన్‌పై ప్రముఖ తమిళ పార్టీ ప్రశంసల జల్లు

బెంగళూరులో 144 సెక్షన్‌

క్లైమాక్స్‌కు చేరిన కన్నడ రాజకీయాలు

లతారజనీకాంత్‌ సంచలన వీడియో

ముఖ్యమంత్రిని కిడ్నాప్‌ చేస్తా!

డుమ్మా కొడితే దొరికిపోతారమ్మా!

నేనూ వీఐపీనే.. రౌడీ సంచలన ఇంటర్వ్యూ

పండితుడి జోస్యం.. మూడోపెళ్లిపై వ్యామోహం!

కర్ణాటక అసెంబ్లీ మ.3గంటల వరకూ వాయిదా

ఒంటి నిండా బంగారంతో గుళ్లోకి వచ్చి..

భర్త ఆత్మహత్య : ముగ్గురు పెళ్లాల ఘర్షణ

కోడలికి కొత్త జీవితం

తమిళ హిజ్రాకు కీలక పదవి

ఫలించిన ట్రబుల్‌ షూటర్‌ చర్చలు

రెబల్‌ ఎమ్మెల్యే నాగరాజ్‌తో మంతనాలు

పెళ్లిళ్లను కాటేస్తున్న కుల తేడాలు

ఆ బాలుడిని పాఠశాలలో చేర్చుకోండి

కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన టిక్‌టాక్‌

నిరాడంబరంగా న్యాయవాది నందిని పెళ్లి

విద్యార్హతలు ఎక్కువగా ఉంటే ఉద్యోగాలకు అనర్హులే!

రోమియో టీచర్‌

కలెక్టర్‌కు కటకటాలు 

‘ఆ అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటారు’

కర్ణాటకలో ఏం జరగబోతోంది?

రామలింగారెడ్డితో కుమారస్వామి మంతనాలు

బళ్లారి ముద్దుబిడ్డ వైఎస్సార్‌

వేలూరులో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

కుమారస్వామి రాజీనామా చేస్తారా? 

ఎమ్మెల్యేల రాజీనామాలకు ఈ నాలుగే కారణమా? 

మీరు మనుషులేనా? ఎక్కడేమి అడగాలో తెలియదా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సెట్‌కు నాలుగు కోట్లు?

ఇట్స్‌ షో టైమ్‌

కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టాం

నేను మారిపోయాను!

సెల్యూట్‌ ఆఫీసర్‌

అప్పుడే సిగరెట్‌ తాగడం మానేశా: నటి