అంబరీష్‌ను తొలగించడం చారిత్రక తప్పిదం

20 Jun, 2016 10:57 IST|Sakshi
అంబరీష్‌ను తొలగించడం చారిత్రక తప్పిదం

హాస్య నటుడు జగ్గేష్

బొమ్మనహళ్లి (బెంగళూరు) : మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో పదవిని కోల్పోయిన గృహనిర్మాణశాఖ మంత్రి అంబరీష్‌కు బీజేపీ నాయకుడు, శాండిల్‌వుడ్‌కే చెందిన హాస్యనటుడు జగ్గేష్  నుంచి మద్దతు లభించింది. ఆయన్ను మంత్రి పదవి నుంచి తప్పించి కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక తప్పిదానికి పాల్పడిందని ఆయన పేర్కొన్నారు.

ఈమేరకు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. అందులో ఉన్న విషయాలు ‘రాజకీయనాయకులకు  పదవులు ఉన్నప్పుడే గౌరవం ఉంటుంది. మంత్రిగా ఐదేళ్లు పని చేసి దిగిపోయిన తర్వాత ఎవరూ గౌరవించరు. అయితే అంబరీష్ రాజకీయ నాయకుడి కంటే కన్నడ నటుడిగా రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నాడు. ఆయన చిన్న పిల్లాడి మన స్థత్వం కలిగిన వారు.  ఎటువంటి తప్పులు చేయలేదు. అయినా మంత్రి పదవి నుంచి తొలగించారు. ఇది చారిత్రాత్మక తప్పిందం. దీని వల్ల కన్నడిగుల ఆగ్రహానికి కాంగ్రెస్ పార్టీ లోనయ్యింది.అందులో ఒక మహిళ చెప్పిన మాటలు విని ఆయన్ను తప్పించడం సరి కాదు’ అని పేర్కొన్నారు.

రాజకీయాల్లోకి వచ్చి ఎంపిగా ఎన్నికై మంత్రిగా ప్రజలకు సేవ చేస్తాను అని 1988లో అంబరీష్ ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పుకొచ్చారన్నారు.  చెప్పిన అన్ని పనులు చేశారు. 2018 నాటికి రాజకీయాల్లో బారీ మార్పులు చోటు చేసు కుంటాయని, అప్పడు ప్రజలు రాజకీయనాకులను మరిచిపోతారు. కాని అంబరీష్‌ను మరిచిపోరు.’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు