దుమారం రేపుతున్న మంత్రిగారి డ్యాన్స్!

18 Dec, 2014 13:49 IST|Sakshi
దుమారం రేపుతున్న మంత్రిగారి డ్యాన్స్!

బెంగళూరు : తానేం చెప్పినా అందుకు మీడియా వ్యతిరేకార్థాలు తీస్తోందని, అంతేకాక తన వ్యక్తిగత స్వేచ్ఛను భంగం కలిగేలా మీడియా వ్యవహరిస్తోందని కర్ణాటక మంత్రి, సినీనటుడు అంబరీష్ మండిపడ్డారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సువర్ణసౌధ ప్రాంగణంలో నిన్న ఆయన మాట్లాడారు. 'నేను రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన నాకంటూ వ్యక్తిగత జీవితం ఉండదా? నేను నా బిడ్డలు, మనవలకు ముద్దిస్తే కూడా విపరీతార్థాలు తీస్తారా? ఇది ఎంతమాతం మంచిది కాదు. మంచి విషయాలను ప్రజలకు తెలియజెప్పండి. ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు మీ పత్రికల్లో, టీవీల్లో వస్తాయా లేదా..' అని మీడియాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

కాగా అంభరీష్‌ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈ సారి... ఓ బార్‌లో మందుకొట్టి... హిందీ సాంగ్‌కు డ్యాన్స్‌ చేస్తూ... కెమెరాకు చిక్కారు. కాగా ఇది ఆయన వ్యక్తిగతం అని మద్దతుదారులు అంటున్నారు. అయితే.. ఇలా మందుకొట్టి.. మజా చేస్తున్న మంత్రికి.. ఇటీవలే.. కోటి 22 లక్షలు ప్రభుత్వ నిధులతో సింగపూర్‌లో వైద్యం చేయించుకోవడలో ఆంతర్యమేమిటని.. ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఇదేకాదు.. గతంలో ఓ అమ్మాయిని అంబరీష్‌ ముద్దుపెట్టిన ఫోటో కూడా సంచలనం సృష్టించింది. దీనిపై ప్రతిపక్షాల ఆందోళన నేపధ్యంలో.. ఒకరు కాదు... 350 మంది అమ్మాయిలను కిస్‌ చేశానంటూ... మంత్రి అంబరీష్‌ రిప్లయ్‌ ఇవ్వటం గతంలో పెద్ద దుమారానికి దారి తీసింది.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా