ఎమి వైదొలిగిందా?

10 Nov, 2014 08:35 IST|Sakshi
ఎమి వైదొలిగిందా?

నటుడు సూర్యకు జంటగా నటించే చిత్రంలో తన పాత్రకు ప్రాధాన్యత లేదని నటి ఎమిజాక్సన్ ఆ చిత్రం నుంచి వైదొలగినట్లు కోలీవుడ్‌లో ప్రచారం జోరందుకుంది. అంజాన్ చిత్రం తరువాత సూర్య నటిస్తున్న తాజా చిత్రం మాస్. ఈయన ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో నయనతార, ఎమిజాక్సన్ హీరోయిన్లుగా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. కార్తీతో బిరియాని (చిత్రం)ని టేస్ట్‌గా వండి వారించిన దర్శకుడు వెంకట్ ప్రభు తాజాగా ఆయన సోదరుడు సూర్యతో చేయిస్తున్న కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైనర్ మాస్ చిత్రం. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రంలో సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు.
 
 ఈ చిత్రంలో నయనతారకు అధిక ప్రాముఖ్యత ఉండేలా కథను మార్చడంతో, నటించడానికి ఇష్టపడని ఎమిజాక్సన్ కాల్‌షీట్స్ లేవంటూ చిత్రం నుంచి వైదొలగినట్లు కోలీవుడ్ టాక్. అయితే చిత్ర యూనిట్ మాత్రం ఎమిజాక్సన్ మాస్ చిత్రం నుంచి వైదొలగలేదని స్పష్టం చేశారు. ఆమె ఈ చిత్రంలో నటిస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం లండన్‌లో వున్న ఎమి త్వరలో చెన్నైకి రానున్నట్లు తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మరో విషయం ఏమిటంటే మాస్ చిత్రానికి సంబంధించి ఎమిజాక్సన్ నటించే సన్నివేశాలకు అధికభాగం విదేశాలలో చిత్రీకరించడానికి చిత్ర యూనిట్ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.  
 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు