ఇంకా దొరకని అనిల్ ఆచూకీ

11 Nov, 2016 02:14 IST|Sakshi

ఉదయ్ మృతదేహం వెలికితీత
ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం పూర్తి
కుటుంబ సభ్యులకు అప్పగింత
మృతదేహం బెంగళూరులోని స్వగృహానికి తరలింపు
మిన్నంటిన రోదనలు
పార్థివదేహానికి నేడు అంత్యక్రియలు
నిర్మాత సుందర్‌గౌడ, నటుడు దునియా విజయ్, రవివర్మ, దర్శకుడు నాగశేఖరపై తాత్కాలిక నిషేధం

బెంగళూరు:  మాస్తిగుడి సినిమా చిత్రీకరణ సమయంలో తిప్పగొండనహళ్లి చెరువులో గల్లంతైన అనిల్ కోసం బుధవారం రాత్రి పొద్దుపోయే వరకూ గాలించినా ప్రయోజనం లేకపోరుుంది. అరుునా అగ్నిమాపకశాఖ సిబ్బందితో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నిపుణులు అక్కడే ఉండి గురువారం కూడా గాలింపును కొనసాగించనున్నారు. ఇదిలా ఉండగా మంగళవారం రాత్రి పొద్దుపోరుున తర్వాత చెరువులో గుర్తించిన ఉదయ్‌రాఘవ మృత దేహాన్ని బుధవారం వెలికితీశారు.  మృత దేహంపై అక్కడక్కడ చేపలు కొరికిన గుర్తులు కూడా ఉన్నారుు. మృతదేహాన్ని చూడటంతోనే అక్కడే ఉన్న కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటారుు. ఇంట్లో ఉన్న ఉదయ్‌రాఘవ తల్లి కౌసల్య సృహ తప్పి పడిపోయారు. ఇదిలా ఉండగా ఉదయ్ మృత దేహానికి చెరువు వద్దనే పోస్ట్‌మార్టం నిర్వహించి  కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రత్యేక అంబులెన్‌‌సలో నగరంలోని యడియూరు వద్ద ఉన్న ఉదయ్ స్వగృహానికి తీసుకువచ్చి  ప్రజల సందర్శనార్థం ఉంచారు. తమ ఆప్తుడిని చివరి సారిగా చూడటం కోసం కోలారు, తుమకూరు నుంచి కూడా చాలా మంది యడియూరుకు చేరుకున్నారు. దీంతో కొంత ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. 

ఉదయ్ అంత్యక్రియలు స్థానిక బనశంకరి హిందూ స్మశాన వాటిలో గురువారం నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణరుుంచారు. ఇదిలా ఉండగా గురువారం సాయంత్రంలోపు అనిల్ ఆచూకి కూడా లభించనుందని అధికారులు చెబుతున్నారు.  స్థానికంగా ఉంటున్న యల్లయ్య చెరువు వద్దకు వెళ్లి కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు అందింది.

తాత్కాలిక నిషేధం..  నిర్మాతసుందరగౌడ,  నటుడు దునియా విజయ్‌తో పాటు స్టంట్‌మాస్టర్ రవివర్మ, దర్శకుడు నాగశేఖర పై తాత్కాలిక నిషేదం విధించినట్లు  కర్ణాటక వాణిజ్య మండలి అధ్యక్షుడు  గోవిందు స్పష్టం చేశారు. తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకూ వీరు  కర్ణాటకతో పాటు తమిళనాడు, తెలుగుతో సహా మరే ఇతర  చలనచిత్రాల్లో కార్యకలాపాలు నిర్వహించరాదని ’మండలి’ తీర్మానించిందన్నారు. బెంగళూరులో బుధవారం ఆయన  మీడియాతో మాట్లాడారు. తిప్పగొండనహళ్లి ఘటనతో కన్నడ చలనచిత్ర రంగం తలవంపులకు గురైందన్నారు.

ఘటనకు కారణమని భావిస్తున్న పై నలుగురిపై తాత్కాలిక నిషేదం విధిస్తున్నామన్నారు.  ప్రస్తుతం జరగాల్సిన కొన్ని కార్యక్రమాల తర్వాత నిషేదం విధించిన ముగ్గురితో పాటు పదాధికారులను ఒకచోట చేర్చి ఘటనపై మరోసారి చర్చించిన తర్వాత దోషులుగా తేలిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవాన్న విషయం ప్రకటిస్తామన్నారు. కాగా, స్నేహితుల కోసం దునియా విజయ్ మూడు రోజులుగా తిప్పగొండనహళ్లి వద్దనే ఉంటూ గాలింస్తుడటాన్ని యావత్ కన్నడ చలనచిత్ర రంగం ప్రశంసిస్తోందని గోవిందు పేర్కొన్నారు. కన్నడ చలనచిత్ర రంగం తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని అనిల్ గాలింపు చర్యల్లో పాల్గొంటున్న దునియా విజయ్ మీడియాతో పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు