ప్రాణం పోయినా.. 34 మందిలో జీవిస్తున్నాడు

12 Sep, 2016 17:04 IST|Sakshi
ప్రాణం పోయినా.. 34 మందిలో జీవిస్తున్నాడు

ఢిల్లీకి చెందిన అన్మోల్ జునేజా జీవితం 20 ఏళ్లకే విషాదాంతమైంది. యాక్సిడెంట్ రూపంలో మృత్యువు అతణ్ని కబళించింది. అన్మోల్ కలలు, ఆశలు ఆవిరయ్యాయి. అన్మోల్ ఈ లోకంలో లేకున్నా అతని తండ్రి తీసుకున్న నిర్ణయంతో 34 మందిలో జీవిస్తున్నాడు.

2012 డిసెంబర్లో ఇంటికి వెళ్తూ తండ్రితో మాట్లాడిన కొన్ని నిమిషాలకే అన్మోల్కు యాక్సిడెంట్ జరిగింది. మధు విహార్ ఫ్లై ఓవర్ దగ్గర ట్రక్ అతణ్ని ఢొకొట్టింది. ఈ ప్రమాదంలో అన్మోల్ తీవ్రంగా గాయపడ్డాడు. రెండు రోజుల తర్వాత వైద్యులు బ్రెయిన్ డెడ్గా నిర్ధారించారు. ఎదిగిన కొడుకు ఇకలేడన్న దుఃఖంలోనూ అన్మోల్ తండ్రి మదన్ మోహన్ జునేజా కఠిన నిర్ణయం తీసుకున్నాడు. అన్మోల్ అవయాలను దానం చేయడం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడాలని, తద్వారా తనకొడుకును వారిలో చూసుకోవాలని భావించాడు. అన్మోల్ బ్రెయిన్ మినహా ఇతర అవయవాలను దానం చేయవచ్చని వైద్యులు సూచించగా, మదన్ అంగీకరించాడు.

అన్మోల్ కళ్లను నలుగురికి దానం చేశారు. అతని కాలేయాన్ని పూర్తిగా మరో వ్యక్తి అమర్చారు. ఎయిమ్స్ వైద్య చరిత్రలో లివర్ను పూర్తిగా మరో వ్యక్తి అమర్చడం ఇదే తొలిసారిని అని వైద్యులు చెప్పారు. కిడ్నీలను, ఇతర కీలక అవయవాలను మరికొంతమందికి దానం చేశారు. ఇలా మొత్తం 34 మందికి అన్మోల్ అవయాలను అమర్చి వారికి కొత్తజీవితాలను ప్రసాదించారు. అన్మోల్ లివర్ అమర్చడం వల్ల ఓ మహిళా ఎస్ఐ ప్రాణాలు కాపాడారు. ఆమె కలిసినపుడు తాను ఉద్వేగానికి లోనయ్యానని అన్మోల్ తండ్రి చెప్పాడు. తాజ్ మహల్ కంటే అన్మోల్ కళ్లు తేజోవంతంగా ప్రకాశిస్తున్నాయని మదన్ కొడుకును గుర్తుచేసుకున్నాడు. అన్మోల్, అతని తండ్రి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారని వైద్యులు ప్రశంసించారు.

మరిన్ని వార్తలు