తవ్వే కొద్ది కట్టలు!

12 Dec, 2016 02:31 IST|Sakshi
తవ్వే కొద్ది కట్టలు!

మరో 40 కేజీల బంగారం పట్టివేత
 కొనసాగుతున్న సోదాలు
 బ్యాంకుల అధికారులకు ముచ్చెమటలు

 
 సాక్షి, చెన్నై , వేలూరు : నల్లధన కుబేరుడు శేఖర్‌రెడ్డి ఇంటా, బయట తవ్వే కొద్ది నోట్ల కట్టలే కాదు, బంగారం బయటపడుతోంది. ఆదివారం చెన్నైలోని ఓ స్టార్ హోటల్‌లో శేఖర్‌రెడ్డికి చెందిన 40 కేజీల బంగారం పట్టుబడ్డట్టు సంకేతలు వెలువడ్డాయి. వేలూరులో సాగిన తనిఖీల్లో ఆరు బ్యాగుల్లో నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తమిళనాడులోని అధికార రాజకీయ వర్గాలకు సన్నిహితుడిగా చెన్నైలో స్థిరపడిన శేఖర్‌రెడ్డి ఆస్తులపై ఇంటా, బయట సాగుతున్న ఐటీ దాడుల్లో ‘కట్టల నాగులు’ బుసలు కొడుతున్న విషయం తెలిసిందే. ఆదివారం కూడా ఆయన, అతని సన్నిహితుల ఇళ్లల్లోనూ ఐటీ దాడులు సాగారుు. టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్‌లో, ఇసుక క్వారీల కింగ్‌గా తమిళనాట రాజకీయ పలుకుబడితో శేఖర్‌రెడ్డి మూట గట్టుకున్న అక్రమార్జన వందల కోట్లలో పట్టుబడుతూ వస్తోంది.
 
 ఈనెల ఎనిమిదో తేదీ నుంచి సాగుతున్న ఈ తనిఖీల్లో శనివారం నాటికి సుమారు రూ. 170 కోట్ల నగదు, 130 కేజీల బంగారం పట్టుబడింది. ఆదివారం సాగిన తనిఖీల్లో మరో 40 కేజీల బంగారం బయటపడినట్టు సంకేతాలు వెలువడ్డాయి. టీ.నగర్ సాంబశివం వీధిలోని ఇంట్లో, ఓ స్టార్ హోటల్‌లో శేఖర్‌రెడ్డి ఉపయోగించే ఓ గదిలో ఈ బంగారం బయటపడ్డట్టు సమాచారం. అలాగే, శనివారం సాయంత్రం ఆరు గంటల నుంచి శేఖర్‌రెడ్డి సతీమణి జయశ్రీ నివాసం ఉంటున్న  కాట్పాడి గాంధీనగర్‌లోని ఇంట్లో రాత్రంతా విచారణ సాగింది. ఉదయం ఏడున్నర గంటల సమయంలో ఐటీ వర్గాలు ఆరు ట్రావెల్ బ్యాగుల్లో నోట్లకట్టల్ని, రెండు సూట్‌కేసుల్లో బంగారాన్ని తమ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఈ బంగారు నగలు, నోట్ల కట్టలు గోడలో రహస్యంగా ఉంచిన అరలో గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించేందు కు నిరాకరించిన అధికారులు ఆగమేఘాలపై చెన్నై చేరుకున్నారు. సోమవారం మరికొన్ని చోట్ల దాడులకు తగ్గ వ్యూహంతో ఐటీ వర్గాలు ఉన్న ట్టు సంకేతాలు వెలువడ్డాయి. శేఖర్‌రెడ్డి సన్నిహితులు మరికొందరు ఉన్నట్టు, వారిని ఐటీ అధికారులు లక్ష్యంగా చేసుకున్నట్టు సమాచారం.
 
 ముచ్చెమటలు : సామన్య జనం చిల్లర కోసం, కొత్త నోట్ల కోసం నానా పాట్లు పడుతుంటే, శేఖర్‌రెడ్డి చేతికి కోట్లాది రూపాయల కొత్త నోట్లు ఎలా వచ్చాయో అన్న విషయంపై ఐటీ వర్గాలు దృష్టి సారించాయి. కొందరు బ్యాంకు అధికారులు, ఫైనాన్షియర్ల ద్వారా ఈ నోట్ల మార్పిడి సాగినట్టుగా విచారణలో తేలింది. చెన్నై ప్యారిస్, షావుకారు పేటల్లోని కొన్ని ఫైనాన్‌‌స సంస్థలు, చెన్నైలోని కొన్ని ప్రైవేటు బ్యాంకులకు చెందిన అధికారుల సహకారంతోనే కొత్త నోట్లు శేఖర్‌రెడ్డి ఇంటి రహస్య అరల్లో కి చేరినట్టు సంకేతాలు వెలువడుతున్నారుు. ఇందుకు తగ్గట్టుగా ఐటీ అధికారులు శేఖర్‌రెడ్డి సతీమణి జయశ్రీని విచారించి, సమాచారాన్ని రా బట్టినట్టు తెలిసింది.
 
ఆయా ఫైనాన్షియర్లు, బ్యాంకుల అధికారుల భర తం పట్టే రీతిలో ఐటీ దష్టి కేంద్రీకరించింది. దీంతో నల్లధనాన్ని తెల్లధనంగా కొత్తనోట్లతో మార్పిడి చేయించిన ఫైనాన్షియర్లు, బ్యాంకు అధికారుల్లో ఆందోళన నెలకొంది. కాగా, ఆదివారం నాటికి శేఖర్‌రెడ్డి, అతని అనుచరుల వద్ద రూ. 200 కోట్ల మేరకు నగదు, 170 కేజీల బంగారం పట్టుబడ్డట్టు సమాచారం. అయితే, ఈ వివరాలను అధికార వర్గాలు ధ్రువీకరించాల్సి ఉంది. శేఖర్‌రెడ్డితో సన్నిహితంగా ఉన్న మరి కొందరిని లక్ష్యంగా చేసుకొని దాడులు సాగనున్నాయి. ఈ దాడుల్లో మరెన్ని వందల కోట్లు చిక్కుతాయో? వేచి చూడాల్సిందేనని ఐటీ వర్గాలు పేర్కొనడం గమనార్హం.

మరిన్ని వార్తలు