గీతం బెంగళూరు క్యాంపస్‌లో ఇంజినీరింగ్ అడ్మిషన్లు

29 Jun, 2014 02:12 IST|Sakshi

దొడ్డబళ్లాపురం :  భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ వారిచే (ఎంహెచ్‌ఆర్‌డీ) ‘ఏ’ కేటగిరి విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందిన దేశంలోని డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో నాలుగో స్థానంలో ఉన్న గీతం విశ్వవిద్యాలయం బెంగళూరు క్యాంపస్‌లో 2014 సంవత్సరానికి ఇంజినీరింగ్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం పోతరాజు వెల్లడించారు.

తాలూకాలోని నాగదేనహళ్లి వద్ద ఉన్న గీతం విశ్వవిద్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంజినీరింగ్‌లో ఈసీఈ. సివి ల్, మెకానికల్, సీఎస్‌ఈ, ఐటీ, ఈఈఈ బ్రాంచిలలో ఈ ప్రవేశాలు నిర్వహిస్తున్నామని  చెప్పారు. ఇంటర్, పీయూసీ,లలో మాథ్స్, ఫిజిక్స్, కెమి స్ట్రీ, సబ్జెక్టులలో ఉత్తీర్ణులైన వారు ఈ కోర్సులలో ప్రవేశానికి అర్హులని తెలిపారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు 25 శాతం సీట్లను కర్ణాటక రాష్ట్ర విద్యార్థులకు కేటాయించామని మిగిలిన సీట్లను అఖిల భారత స్థాయి లో ఏ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నా కేటాయిస్తామన్నారు.
 
అంతర్జాతీయ క్యాంపస్‌గా గీతం :  గీతం విశ్వవిద్యాలయం విశాఖపట్నం, హైదరాబాద్‌ల తరువాత కర్ణాటక లోని నాగదేనహళ్లి వద్ద నెలకొల్పిన మూడవ క్యాంపస్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించినట్లు రిజిస్ట్రార్ తెలిపారు. బోధనతో పాటు పరిశోధనలు జరపడానికి రానున్న కాలంలో దాదాపు 100 కోట్లు వెచ్చించనున్నామని, దీనికి కర్ణాటక ప్రభుత్వానికి ఎల్‌ఓఐ (లెటర్ ఆఫ్ ఇంట్రస్ట్)ను సమర్పించామన్నారు. పలు అంతర్జాతీయ సంస్థలతో, విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు గల గీతం విశ్వ విద్యాలయం త్వరలో నాగదేనహళ్లి పరిసరాలలోని నిరుద్యోగ యువతకు ప్రత్యేకంగా సాంకేతిక నిపుణతపై శిక్షణ ఇవ్వనున్నామని పేర్కొన్నారు. గీతం పూర్వ విద్యార్థుల సహకారంతో ఓటీ ఇంక్యుబేషన్ సెంటర్‌ను నెల కొల్పనున్నట్లు ఆయన తెలిపారు.
 
విదేశాలకు గీతం విద్యార్థులు : విదేశాలలో తాము ఒప్పందం కుదుర్చుకున్న విశ్వవిద్యాలయాలకు గీతం విద్యార్థులను పంపించి, అక్కడి విద్యార్థులను ఇక్కడకు రప్పించడం ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్య అందేలా చూస్తామన్నారు. అంతేగాక విదేశీ విశ్వ విద్యాలయాల ప్రొఫెసర్లను రప్పించి వారిచే బోధన చేయిస్తామన్నారు.

పలు పరిశ్రమలతో ఒప్పందం చేసుకుని విద్యార్థులకు చదువుతోపాటు అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యం పెంపొందించేందుకు శిక్షణ ఇప్పిస్తామన్నారు. జులై 7న క్యాంపస్‌లో తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. విలేకరుల సమావేశంలో గీతం క్యాంపస్ డెరైక్టర్ ప్రొఫెసర్ విజయభాస్కరరాజు,వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్‌వీ కృష్ణప్రసాద్,ప్రొఫెసర్ వైస్ చాన్సలర్( ఆర్ అండ్ డీ )డా.ఆర్ శివకుమార్ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు