ఆంధ్రప్రదేశ్ విభజన సరికాదు

7 Aug, 2013 04:33 IST|Sakshi
బనశంకరి, న్యూస్‌లైన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సీట్లు, ఓట్లు కోసం విభజించడం సరికాదని ప్రవాసాంధ్రులు కోటిరెడ్డి, వివేకానందరెడ్డి అన్నారు. మంగళవారం జేపీ.నగర ఏడవ పేజ్‌లోని కేఆర్.లేఔట్‌లో ప్రవాసాంధ్ర ఐటీ ఉద్యోగులు కోటిరెడ్డి, వివేకానందరెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా నల్లబ్యాడ్జీలు ధరించి ప్లకార్డు పట్టుకుని నిరసన వ ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కుటిల రాజకీయాల కోసం అంధ్రప్రదేశ్‌ను విభజించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.
 
 విభజన చేస్తే ప్రత్యేకరాష్ట్రాల ఉద్యమాలు ఊపందుకుని దేశ ఉనికికే ప్రమాదకరంగా మారతాయన్నారు. తెలంగాణా రాష్ట్రం విషయంలో కేంద్రంలోని యుపీఏ ప్రభుత్వం, సోనియాగాంధీ మరోసారి పునరాలోచించాలన్నారు. సమైకాంధ్రకు మద్దతుగా న గరంలోని ప్రవాసాంధ్రులు మద్దతు ప్రకటించాలని వారు పిలుపునిచ్చారు. ధర్నాలో వైఎస్.రవిరెడ్డి, సీ.చంద్రశేఖర్‌రెడ్డి, సురేంద్ర, హరి, భరత్‌రాజు, కే.శంకర, శ్రావణ్‌కుమార్, సచిన్‌అగర్వాల్, ఆనందరెడ్డి, ఎన్‌ఆర్‌ఐలు రూపేశ్‌కుమార్, కార్తీక్‌రెడ్డి, రవీంద్రారెడ్డి, కిరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు