ఐసీటీ అవార్డులకు దరఖాస్తులు

11 Jan, 2014 02:03 IST|Sakshi

 కొరుక్కుపేట, న్యూస్‌లైన్:
 టెక్నాలజీని ఉపయోగించుకు ని ఉత్తమ సేవలు అందించే ఫ్యాకల్టీ, ఉపాధ్యాయులు, ఔత్సాహిక వేత్తల ను ప్రోత్సహించేలా ఐసీటీ అకాడమీ ఆఫ్ తమిళనాడు (ఐసీటీఏసీటీ) ఉత్తమ టెక్నో ఫ్యాకల్టీ అవార్డు (హయ్యర్ ఎడ్యుకేషన్), ఉత్తమ టెక్నో టీచర్ అవార్డు (స్కూల్ ఎడ్యుకేషన్) ఉత్తమ ఔత్సాహికుల అవార్డులను అందించనుంది.ఈ అవార్డుల కోసం ఆసక్తి గల ఉత్తమ టెక్నాలజీ విద్యను అందించే వారి నుంచి దరఖాస్తుల ను ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ సీఆర్ వో చైర్మన్ లక్ష్మీనారాయణన్ ప్రకటించారు. శుక్రవారం నగరంలోని ఓ హోటల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో అవార్డుల గురించి వివరించారు. టెక్నాలజీ విద్యను అభివృద్ధి పరచడమే లక్ష్యంగా ఐసీటీ అకాడమీ ముందుకెళుతోం దన్నారు.  జనవరి 20వ తేదీ లోపు దరఖాస్తులను పూర్తి చేసి పంపాల్సి ఉంటుందన్నారు.
 
 ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను పూర్తి చేయాల్సి ఉం టుందని దీని కోసం www.ictact bridge. com వెబ్‌సైట్‌ను పరిశీలించగలరని కోరారు. ఈ అవార్డులను ఫిబ్రవరి 26, 27 తేదీలలో చెన్నై ట్రేడ్ సెంటర్ వేదికగా జరుగు 13వ ఐసీటీఎసీటీ బ్రిడ్జి - 2014 ఇండస్ట్రీ ఇన్‌స్టిట్యూట్ ఇంటరక్షన్ సమావేశంలో ప్రదానం చేయనున్నామన్నారు.  ముందుగా ఫిబ్రవరి 26, 27 తేదీల్లో జరిగే ఐసీటీ సమావేశం లోగోను లక్ష్మీనారాయణన్ ఆవిష్కరించారు. ఐసీటీ సీఈవో శివకుమార్ పాల్గొన్నారు.
 
 

>
మరిన్ని వార్తలు