పరువు నష్టం కేసులో సీఎంకు అరెస్ట్ వారెంట్

11 Apr, 2017 15:55 IST|Sakshi
పరువు నష్టం కేసులో సీఎంకు అరెస్ట్ వారెంట్

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను వివాదాలు వెంటాడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన ఆరోపణలకు సంబంధించి పరువు నష్టం కేసులో విచారణకు హాజరు కానందుకు కేజ్రీవాల్‌కు అసోం కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

'ప్రధాని మోదీ ఇంటర్ వరకే చదివారు. ఆ తర్వాత ఆయన డిగ్రీలు నకిలీవి' అంటూ గతంలో కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ విద్యార్థతలపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, ఆయనను కించపరిచేలా కేజ్రీవాల్ ట్వీట్ చేశారని ఆరోపిస్తూ కర్బి అంగ్లాంగ్ అటానమస్ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ సూర్జో రోంగ్‌ఫర్‌.. అసోంలోని దీఫు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు సమన్లు జారీ చేయగా కేజ్రీవాల్ వెళ్లలేదు. దీంతో ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

>
మరిన్ని వార్తలు