ఆశా కార్యకర్త అనుమానాస్పద మృతి

24 Jan, 2017 14:39 IST|Sakshi
పెగడపల్లి: జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండలం వెంగళాయిపేటలో ఓ ‘ఆశ’ కార్యకర్త అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మోకెనపెల్లి పద్మ ‘ఆశ’ కార్యకర్తగా పనిచేస్తున్నది. అయితే ఆమె గొంతు కోసి ఉండి రక్తపుమడుగులో మృతిచెంది ఉంది. ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా లేక ఎవరైనా హత్య చేశారా అనేది తెలియలేదు. భర్త వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఎస్సై వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు