మార్చి 6 నుంచి అసెంబ్లీ

22 Feb, 2017 01:46 IST|Sakshi
మార్చి 6 నుంచి అసెంబ్లీ

13న బడ్జెట్‌ ప్రవేశపెడతాం    
బాలికలకు ఈ బడ్జెట్‌లో ప్రత్యేక పథకం
శాఖాధిపతుల సమావేశంలో సీఎం చంద్రబాబు


సాక్షి, అమరావతి: శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు వెలగపూడిలో మార్చి 6వ తేదీన ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. 13వ తేదీన ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెడతారని తెలిపారు. తొలుత మార్చి 3వ తేదీ నుంచి సమావేశాలను ప్రారంభించి 8వ తేదీన బడ్జెట్‌ ప్రవేశ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే ఉపాధ్యాయ,  గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గా లకు మార్చి 9న ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఒకరోజు ముందు బడ్జెట్‌ ప్రవేశపెట్టడంపై రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ సమావేశాల తేదీల్లో మార్పులు చేశారు. మంగళ వారం వెలగపూడి సచివాలయంలో ముఖ్య కార్యదర్శు లు, కార్యదర్శులు, విభాగాధిపతులతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ గతంలో శాసనసభకు, ప్రభుత్వ కార్యాలయా లకు మధ్య దూరం ఉండేదని, వెలగపూడిలో ఆ సమస్య లేదని చెప్పారు. ఆడబిడ్డల కోసం ఈ బడ్జెట్‌లో ఏదైనా కొత్త పథకం ప్రకటించడానికి కసరత్తు జరుగుతోందని తెలిపారు. అలాగే యువతకు ఏంచేయాలనే అంశాన్నీ పరిశీలిస్తున్నామన్నారు.

గుంటూరు జిల్లా టీడీపీ నేతలకు బాబు వార్నింగ్‌
ఎవరు ఏం చేస్తున్నారో నాకు తెలుసు.. అందరి చరిత్రా నా దగ్గర ఉందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆయన మంగళవారం రాత్రి గుంటూరు జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులతో మాట్లా డారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి వ్యవహారౖ శెలిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల ఆయన బహిరంగంగా పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేయడాన్ని ప్రశ్నిస్తూ అందరినీ కలుపుకొని వెళ్లాలని సూచించారు.   మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్‌బాబు వైఖరిపై కూడా చంద్రబాబు అసంతృప్తిం వ్యక్తం చేసినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు