ప్రత్యక్ష ప్రసారంలో ఇబ్బందేమిటో..?

10 Aug, 2016 01:41 IST|Sakshi
ప్రత్యక్ష ప్రసారంలో ఇబ్బందేమిటో..?

సాక్షి, చెన్నై: అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసా రం ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో ఇబ్బం దులు ఏమిటో అని ప్రభుత్వాన్ని మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. ఇందుకుగాను నిర్ణయం తీసుకునే విషుంగా మరిం త  సమయాన్ని న్యాయమూర్తులు కే టాయించారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను టీవీల ద్వారా ప్రత్యక్ష ప్ర సారం చేయాలన్న డిమాండ్ ఎప్ప టి నుంచో వస్తున్న విషయం తెలిసిందే.

 అయితే, పాలకుల్లో స్పందన మాత్రం లేదు. ఈ వ్యవహారం మద్రాసు హైకోర్టుకు చేరింది. ఈ ప్రజా వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి మహాదేవన్ నేతృత్వంలోని బెంచ్ మంగళవారం విచారించింది. ఇప్పటికే  ఈ విషయంగా నిర్ణయాలు తీసుకునేందుకుగాను ప్రభుత్వానికి పలుసార్లు సమయాన్ని కోర్టు కేటాయించిందని చెప్పవచ్చు. తాజా విచారణ సమయంలో ప్రభుత్వాన్ని బెంచ్ ప్రశ్నిస్తూ కొన్ని వ్యాఖ్యల్ని సంధించిందని చెప్పవచ్చు.

పార్లమెంట్, రాజ్య సభల్లోని వ్యవహారాల్నే ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నప్పుడు,  ఇక్కడి అసెంబ్లీ సమావేశాలను ప్రసారం చేయడంలో ఇబ్బందులు ఏమిటో అని న్యాయమూర్తులు ప్రశ్నించారు.  ఇంతలో అడ్వకేట్ జనరల్ సోమయాజులు జోక్యంచేసుకుని సమయం కేటాయించాలని విన్నవించారు. అదే సమయంలో పిటిషనర్ తరఫున న్యాయవాది శేషాద్రి అందుకుని కేరళ తరహాలో ఇక్కడ ప్రసారాలు చేయవచ్చుగా అని సూచించారు. ఈ ప్రసారాలకు నిధులు ఖర్చు అవుతాయన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుందని, కేరళలో అనుసరిస్తున్న విధానం అనుసరిస్తూ నిధులతో పనిలేదని వివరించారు. దీంతో తదుపరి విచారణ అక్టోబర్‌కు వాయిదా పడింది.

నష్టపరిహారం కోసం:  ఎన్నికల వాయిదా పడడంతో తమకు ఏర్పడ్డ న ష్టాన్ని ఎన్నికల కమిషన్ ద్వారా ఇప్పించాలంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. మే 16న రాష్ట్రంలోని 232 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే, నగదు బట్వాడా ఆరోపణలతో తంజావూరు, అరవకురిచ్చిల్లో ఎన్నికలు ఆ గాయి. ఈ ఎన్నికల నిర్వహణ ఎప్పుడో అన్నది తేలాల్సి ఉంది. కాగా, డీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్థులు నగదు బట్వాడా కారణంగా ఈ ఎన్నికలు వాయిదా పడ్డాయని, ఈ దృష్ట్యా తమకు నష్టం ఏర్పడి ఉన్నదంటూ బీజేపీ, పీఎంకే తదితర అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.

 ఆ ఎన్నికల నిమిత్తం తాము  నియమ నిబంధనలకు లోబడి ఖర్చులు పె ట్టి ఉన్నామని, ఆ ఖర్చులను తమకు ఎవరు ఇస్తారని పిటిషన్ ద్వారా ఎన్నికల యంత్రాంగాన్ని ప్రశ్నించారు. తమకు నష్ట పరిహారం అం దించే విధంగా ఎన్నికల యంత్రాంగాన్ని ఆదేశించాలని విన్నవించారు. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి మహాదేవన్ నేతృత్వంలోని బెంచ్ విచారించింది. ఎన్నికల యంత్రాంగం తరఫున న్యాయవాది నిరంజన్ హాజరై, నష్ట పరిహారం చెల్లించేందుకు తగ్గ ఆస్కారాలు లేవు అని బెంచ్ దృష్టికి తెచ్చారు. దీంతో తదుపరి విచారణ సెప్టెంబరు 20కు వాయిదా పడింది.
 

మరిన్ని వార్తలు