నవ దంపతులపై దాడి

21 Jun, 2017 04:50 IST|Sakshi
నవ దంపతులపై దాడి

ఐదుగురిపై కేసు
కేకేనగర్‌ : తంజావూరు జిల్లా పాపనాశం సమీపంలో పెళ్లి జరిగిన 30 నిమిషాలకే నవ వధువు తరఫు వారు దాడి జరపడంతో సంచలనం కలిగింది. దీనికి సంబంధించి ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తంజావూరు సమీపంలో గల కరందై వీధికి చెందిన మణివన్నన్‌. ఇతని కుమారుడు రాజేష్‌ (22). బీబీఏ చదివి మినీబస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు ఒరత్తనాడు సమీపంలో గల వడక్కుర్‌ ప్రాంతానికి చెందిన వీరరాజు కుమార్తె అభినయ (22)ను ప్రేమించాడు.

ఈ ఇద్దరు వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు.  సోమవారం అభినయ, రాజేష్‌ పాపనాశనం తాలూకా కార్యాలయం వెనుక గల దుర్గమ్మన్‌ ఆలయంలో రహస్య వివాహం చేసుకున్నారు. ఈ విషయం అభినయ కుటుంబ సభ్యులకు తెలియడంతో ఆగ్రహించిన వారు పదిమందితో ఆలయం వద్దకు వచ్చారు. అక్కడ పెళ్లి చేసుకున్న రాజేష్, అభినయ దంపతులపై దుడ్డుకర్రలతో దాడి చేసి గాయపరిచారు. వెంటనే ప్రేమ జంట తప్పించుకుని పారిపోయి పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై పాపనాశం సహాయ పోలీసు సూపరింటెండెంట్‌ సెల్వరాజ్‌ వారి వద్ద విచారణ జరిపారు. రాజేష్, అభినయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి వారి కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు