రైలు నుంచి జారిపడ్డ చిన్నారి మృతి

17 Oct, 2016 08:11 IST|Sakshi
రైలు నుంచి జారిపడ్డ చిన్నారి మృతి

కర్నూలు: కదులుతున్న రైల్లో నుంచి ఓ చిన్నారి జారి పడిన ఘటన కర్నూలు జిల్లాలోని బేతంచర్లలో సోమవారం చోటుచేసుకుంది. రైలు అత్యవసర కిటికీ పక్కన కూర్చున్న లక్ష్మీ చేతిలోనుంచి ఏడాదిన్నర చిన్నారి చైతు జారి రైలు కిందపడింది. వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు రైలు చైన్‌లాగి కిందకి వెళ్లి చూసేసరికి చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.

విజయనగరానికి చెందిన పైడిరాజు, లక్ష్మీ దంపతులు అమరావతి ఎక్స్‌ప్రెస్‌లో విజయనగరానికి వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది. చైతు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

 

మరిన్ని వార్తలు