లష్కర్ ఉగ్రవాది బెయిల్ పిటిషన్ తిరస్కృతి

31 Mar, 2015 03:44 IST|Sakshi

న్యూఢిల్లీ: వ్యాపారవేత్త అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కరే తోయిబా ఉగ్రవాది  పెట్టుకున్న బెయిల్ దరఖాస్తును స్థానిక న్యాయస్థానం తోసిపుచ్చింది. భారత్‌లో విధ్వంసకర కార్యక్రమాలను చేపట్టేందుకు అవసరమైన నిధుల కోసం నిందితుడు మహ్మద్ షాహిద్  అనే ఉగ్రవాది నగరానికి చెందిన ఓ వ్యాపారిని అపహరించేందుకు యత్నించాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని హర్యానాలోని మేవట్ ప్రాంతంలో 2013,డిసెంబర్‌లో పోలీసులు అరెస్టుచేసిన సంగతి విదితమే. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిందితుడు స్థానిక అదనపు సెషన్స్ కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి రితేష్‌సింగ్ తోసిపుచ్చారు. ‘నిందితుడిపై అభియోగాలను నమోదు చేయాల్సి ఉంది. నిందితుడిపై వచ్చిన అభియోగాలను దృష్టిలో పెట్టుకుని బె యిల్ దరఖాస్తును తిరస్కరిస్తున్నా’ అని న్యాయమూర్తి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు