జనవరి 1న జన్మించే వారికి బంపర్‌ ఆఫర్‌

29 Dec, 2017 08:06 IST|Sakshi

‘ఆడపిల్ల అదృష్టలక్ష్మి’ పథకాన్ని ప్రకటించిన బెంగళూరు మేయర్‌

నగర పాలిక ఆస్పత్రుల్లోనే, సాధారణ ప్రసవం జరిగితేనే వర్తింపు

బెంగళూరు: కొత్త సంవత్సరం రోజున జన్మించే మొదటి ఆడపిల్లకు బెంగళూరు పాలికె బంపర్‌ ఆఫర్‌ అందించనుంది. బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె పరిధిలోని పాలికె ఆసుపత్రుల్లో జన్మించే మొట్టమొదటి ఆడపిల్లపై కనకవర్షం కురియనుంది. 31వ తేదీన అర్ధరాత్రి 12 గంటలు, ఆ తరువాత కళ్లుతెరిచే ఆడకూతురికి రూ.5 లక్షల నగదు బహుమతి అందజేస్తామని మేయర్‌ సంపత్‌రాజ్‌ గురువారం ప్రకటించారు. ఆ చిన్నారి పేరుతో బీబీఎంపీ కమిషనర్‌ ఉమ్మడి ఖాతా తెరిచి ఆ నగదును డిపాజిట్‌ చేస్తామని తెలిపారు.

ఆడపిల్లకు 18 ఏళ్లు నిండిన తరువాత ఆమె విద్యాభ్యాసం కోసం ఈ నగదును వినియోగించవచ్చునని మేయర్‌ చెప్పారు. సిజేరియన్‌ కాకుండా, సాధారణ ప్రసవం ద్వారా జన్మించిన ఆడపిల్లకు మాత్రమే ఈ అదృష్టం వరించనుంది. నేటి పరిస్థితుల్లో ఆడపిల్ల అంటే నిర్లక్ష్యం చేస్తున్నారని కానీ ఆడపిల్లలు అందరితో సరిసమానంగా నిలబడి పనిచేస్తారని అన్నారు. అలాంటి ఆడపిల్లలు  ఎంతో ముఖ్యమని భావించి వారిని ప్రోత్సహించడానికి నజరానా ప్రకటించామని తెలిపారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా