బార్ కౌన్సిల్ అధ్యక్షునిగా మోహనకృష్ణన్

12 Dec, 2016 15:09 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: మద్రాసు హైకోర్టు న్యాయవాదుల సంఘం (బార్ కౌన్సిల్) అధ్యక్షునిగా మోహనకృష్ణన్ మరోసారి ఎన్నికయ్యారు. మద్రాసు హైకోర్టు న్యాయవాదుల సంఘంలో సుమారు 4,777 మంది సభ్యులున్నారు. ఈ సంఘానికి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి, సీనియర్ కార్యనిర్వాహక సభ్యులు జూని యర్ కార్యనిర్వాహక సభ్యు లు, లైబ్రేరియన్ ఉంటారు. ఈ కార్యవర్గానికి రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తారు. 2016-18 సంవత్సరానికిగానూ సంఘం ఎన్నికలు బుధవారం జరి గారుు.

అధ్యక్ష పదవికి మాజీ అధ్యక్షులు మోహన్‌కృష్ణన్, ప్రస్తుత కార్యదర్శి అరివళగన్, పీఎం.దురైస్వామి, ఎస్.కాశీరామలింగం, ఎల్. ఉరుగవేలు, కే. సత్యపాల్, సి.విజయకుమార్ ఇలా మొత్తం ఏడుగురు పోటీపడ్డా రు. ఉపాధ్యక్ష పదవికి ఎ.అబ్దుల్‌రెహమాన్, జార్జ్ చార్లస్, ఎం. జయకుమార్, మదివానన్, ఏ. మోహన్‌దాస్, ఆర్ మురళీ, ఎస్.ముత్తురామన్ ఎస్ పద్మ, ఎన్ ప్రభాకరన్,  రువా, ఎమ్‌ఏఏఆర్ సుధా, విక్టర్, సామువేల్ ఇలా 13 మంది బరిలోకి దిగారు. అలాగే కార్యదర్శి పదవికి పీవీ ఇళంగో, కృష్ణకుమార్, ఎస్ శశికుమార ఆర్ శివశంకర్ ఇలా మొత్తం నలుగురు పోటీపడ్డారు. కోశాధికారి స్థానానికి సీ ఆరోగ్యదాస్, ఎస్ కామరాజ్, టీ శివషణ్ముగం, కే సుబ్రమణియన్ పోటీలో నిలిచారు.

ఇక మిగిలి ఉన్న  లైబ్రేరియన్ స్థానానికి గజలక్ష్మి రాజేంద్రన్, కే కుమరేశన్, మహావీర్ శివాజీ, వీఎమ్ రఘు, ఏ. రాజారాం, జి. రాజేష్, టి.రవికుమార్, కేకే శివకుమార్,  కే తిప్పుకల్‌థాన్ పోటీపడ్డారు. బుధవారం పోలింగ్ జరిగిన తరువాత బ్యాలెట్ బాక్సులను సంఘం కార్యాలయంలో గట్టి బందోబస్తు మధ్య భద్రపరిచగా గురువారం ఓట్ల లెక్కింపు సాగింది. అధ్యక్షపదవికి పోలైన ఓట్లను తొలుత లెక్కించారు. గతంలో అధ్యక్షులుగా పనిచేసిన మోహనకృష్ణన్, ప్రస్తుత కార్యదర్శి అరివళగన్‌ల మధ్య గట్టిపోటీ నెలకొన్నట్లు ఓట్ల లెక్కింపులో తేలింది. మొదటి రౌండు నుంచి మోహనకృష్ణన్ ఆధిపత్యాన్ని చాటుకుని 1001 ఓట్ల మెజారిటీ తో అధ్యక్షులుగా మరోసారి ఎన్నికయ్యారు.

మరిన్ని వార్తలు