'టాలెంట్‌కే టీమిండియాలో చోటు'

26 Sep, 2016 08:57 IST|Sakshi
'టాలెంట్‌కే టీమిండియాలో చోటు'
- 2019 వరల్డ్ కప్ టార్గెట్
-  సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంఎస్‌కే ప్రసాద్

తిరుమల: టీమిండియా క్రికెట్ జట్టులో ప్రాంతాలు, రాష్ట్రాలకతీతంగా టాలెంట్ ఉన్నవారికే చోటు లభిస్తుందని, భారత్ క్రికెట్ సెలక్షన్ కమిటీ నూతన చైర్మన్ ఎంఎస్‌కే ప్రసాద్ అన్నారు. ఆదివారం ఆయన కుటుంబ సభ్యులతో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. 
 
రాబోయే మూడేళ్లలో ప్రణాళికలు సిద్ధం చేసుకుని, 2019 వరల్డ్ క్రికెట్ కప్ టార్గెట్‌గా ముందుకు సాగుతామన్నారు. బీసీసీఐలో ఏడాదిపాటు సభ్యుడిగా కొనసాగిన అనుభవం తాను చైర్మన్‌గా మరింత సమర్థవంతంగా పనిచేయటానికి దోహదపడుతుందన్నారు. పాత కమిటీ నిర్ణయాలతోపాటు సరికొత్త ప్రణాళికలతో జట్టును మరింత పటిష్టం చేస్తామన్నారు. శ్రీవారి ఆశీస్సులతో బాధ్యతలు తీసుకుని జట్టును విజయపథంలో నడిపించేందుకు కృషి చేస్తామని ఎంఎస్‌కే తెలిపారు.
మరిన్ని వార్తలు