8న బళ్లారిలో కే-సెట్

5 Dec, 2013 03:04 IST|Sakshi

=  32 సబ్జెక్టులకు ఐదు కేంద్రాల్లో పరీక్షలు
 = వీఎస్కేయూ వీసీ మంజప్ప హొసమనె

 
సాక్షి, బళ్లారి : బళ్లారి నగరంలో ఈనెల 8వ తేదీన కేసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం(వీఎస్కేయూ)వైస్ చాన్స్‌లర్ మంజప్ప హొసమనె తెలిపారు. నగర శివార్లలోని వీఎస్కేయూలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 నోడల్ కేంద్రాల్లో కేసెట్ పరీక్షలు జరుపుతున్నారని, అందులో భాగంగా బళ్లారి నగరంలోని  సరళాదేవి సతీష్‌చంద్ర అగర్వాల్,ప్రభుత్వ ఎక్స్ మున్సిపల్ పీయూ కళాశాల, బసవరాజేశ్వరి పబ్లిక్ స్కూల్ అండ్ కాలేజీ, వాసవీ పీయూ కళాశాల, గాంధీనగర్ చైతన్య పీయూ కళాశాల  కేంద్రాల్లో  32 సబ్జెక్ట్‌లకు సంబంధించి పరీక్షలు జరుగుతాయన్నారు.
 
సబ్జెక్టులవారిగీ కేంద్రాలు

కన్నడ, కెమికల్ సైన్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ కోర్సులకు సంబంధించి సరళాదేవి కళాశాలలో, కన్నడ, లైబ్రరీ సైన్స్, హిందీ, ఫిజికల్ సైన్స్, ఇంగ్లిష్, ఫిజికల్ ఎడ్యుకేషన్, సైకాలజీకి సంబంధించి ఎక్స్ మున్సిపల్ కళాశాలలో, ఎకనామిక్స్ సోషియల్ వర్క్, లైఫ్ సైన్స్, మేనేజ్‌మెంట్ మాస్ కమ్యూనికేషన్, ఉర్దూ బసవరాజేశ్వరీ పీయూ కళాశాలలో, సోషియాలజీ, మేథమెటికల్ సైన్స్, ఎలక్ట్రానిక్ సైన్స్, పర్యావరణ పరిరక్షణ సమితి ఎగ్జామ్స్, అర్థ్ సైన్స్, లా, హోంసైన్స్ వాసవీ పీయూ కళాశాలలో, హిస్టరీ, ఎడ్యుకేషన్, పొలిటికల్ సైన్స్, జియోగ్రఫి, సాంస్కృతికం, ఫ్లో లిటరేచర్, పబ్లిక్ అడ్మిస్ట్రేషన్ చైతన్య కళాశాలలో ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

మొత్తం బళ్లారి సెంటర్లలో 3626 మంది విద్యార్థులకు హాల్ టికెట్లు అందజేశారన్నారు.  ఫస్ట్, సెకెండ్ పేపర్లు ఉదయం 9   నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మూడవ పేపర్ మధ్యాహ్నం 1.30 నుంచి 4 గంటల వరకు నిర్వహిస్తామన్నారు.
 

మరిన్ని వార్తలు