ఉత్తమ మంత్రిగా పంకజా ముండే

7 Feb, 2015 23:36 IST|Sakshi
ఉత్తమ మంత్రిగా పంకజా ముండే

►రెండో స్థానంలో ముఖ్యమంత్రి
►మరాఠీ చానెల్ సర్వేలో ప్రజాభిప్రాయం

 
సాక్షి, ముంబై : బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వంలో ఉత్తమ మంత్రిగా పంకజా ముండే ప్రథమ స్థానంలో నిలిచారు. కాగా రాష్ట్రాధినేత, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ద్వితీయ స్థానంతో సరిపెట్టుకోగా, తృతీయ స్థానంలో శివసేన నాయకుడు ఏక్‌నాథ్ శిందే నిలిచారు. బీజేపీ, శివసేనల ప్రభుత్వం శనివారంతో వంద రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఓ మరాఠీ న్యూస్ చానెల్ మంత్రుల పనితీరుపై ప్రేక్షకుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. దాదాపు లక్ష మంది పాల్గొన్న ఈ సర్వేలో అత్యధిక ఓట్లతో పంకజా ముండే అందరికంటే ముందు నిలిచారు. మంత్రిగా ఆమె పనితీరు బాగుందంటూ 11,760 మంది ఓటు వేశారు.

ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను మెచ్చకుంటూ 9,545 మంది ఓటేశారు. మరోవైపు ఏక్‌నాథ్ శిందే పనితీరుబాగుందని 8,093 మంది ఓటేశారు. ఇక అత్యల్పంగా కేవలం 3,267 ఓట్లతో చంద్రశేఖర్ బావన్‌కులే చివరి స్థానంలో నిలిచారు. మిగిలిన మంత్రుల్లో వినోద్ తావ్డే (7,411) నాలుగో స్థానంలో నిలిచారు.
 ఆ తరువాత వరుసగా సుభాష్ దేశాయి (6,726), రామ్‌దాస్ కదం (6,694), దివాకర్ రావుతే (6,024), దీపక్ సావంత్ (5,473), సుధీర్ మునగంటివార్ (5,466), ఏక్‌నాథ్ ఖడ్సే (5,320), చంద్రకాంత్ పాటిల్ (5,186), గిరీష్ మహాజన్ (4,930), గిరీష్ బాపట్ 860)లున్నారు.

మరిన్ని వార్తలు