సంతానంకు జోడిగా భాను

29 Jan, 2015 00:38 IST|Sakshi
సంతానంకు జోడిగా భాను

తామరభర్ణి చిత్రంలో విశాల్‌కు జంటగా పరిచయమైన మలయాళీ కుట్టి భాను. ఆ చిత్రం హిట్ అయినా, ఈ అమ్మడుకు కష్టాలు వెంటాడుతూ వస్తున్నాయి. ఇందుకు కుటుంబ సమస్య కూడా కారణం. ఆ మధ్య వసంత్ దర్శకత్వంలో మూన్‌డ్రు పేరు మూన్‌డ్రు కాదల్‌లో ముగ్గురు నాయకిల్లో ఒకరుగా నటించింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత దర్శకుడు రాజేష్ మరో అవకాశం కల్పించారు. తాను దర్శకత్వం వహిస్తున్న వాసువుం...శరవణను ఎన్న పడి చవ్వంగ చిత్రంలో ఆర్య, తమన్న నాయకా నాయకీలుగా నటిస్తున్నారు.

ఇందులో హాస్య పాత్రలో సంతానం నటిస్తుండగా, అతడికి జంటగా భాను ఎంపిక అయ్యారు. ఇది ఇద్దరు స్నేహితులు కలిసి చదువుకున్న ఇతివృత్తాంతంతో నిర్మిస్తున్న చిత్రం. ఇది పూర్తిగా వినోద భరిత చిత్రం. ఇందులో భాను పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందట. సంతానంతో డ్యూయెట్స్ కూడా పాడుతుందట.ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చెన్నైలో తమన్న, ఆర్యలపై పాట చిత్రీకరణ సాగుతోంది. తదుపరి సంతానం భానుల యుగళ గీతం చిత్రీకరించనున్నట్టు యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి.  
 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా