చంద్రబాబు దగ్గర ఉన్న నోట్ల కట్టలు కాలిస్తే...

13 Oct, 2016 11:23 IST|Sakshi
చంద్రబాబు దగ్గర ఉన్న నోట్ల కట్టలు కాలిస్తే...

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి గురువారం తిరుపతిలో నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఓ పెద్ద నల్ల కుబేరుడు అని ఆయన అభివర్ణించారు. చంద్రబాబు వద్ద ఉన్న నోట్ల కట్టలు కాలిస్తే... ఓ మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుందని ఎద్దేవా చేశారు. రూ. 1000 నోట్లు రద్దు చేయాలని చంద్రబాబు చెప్పడం చూస్తుంటే... దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు.

12 ఏళ్ల క్రితమే చంద్రబాబు ఓ అవినీతి సామ్రాట్ అని తెహల్కా డాట్ కామ్ స్పష్టం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా భూమన కరుణాకర్రెడ్డి గుర్తు చేశారు. ఇప్పడు చంద్రబాబు, అనుయాయుల నివాస గృహాలపై ఐటీ దాడులు చేస్తే రూ. లక్షల కోట్లు దొరుకుతాయన్నారు. అవినీతికి పెట్టింది పేరు చంద్రబాబు అంటూ భూమన వ్యాఖ్యానించారు.

>
మరిన్ని వార్తలు