పే..ద్ద దోసె

12 Jan, 2019 07:38 IST|Sakshi

గిన్నిస్‌ రికార్డు ‘దోసె ’

100 అడుగుల దోసె తయారీతో గిన్నిస్‌ రికార్డు

చెన్నై, కొరుక్కుపేట: సాధారణంగా దోసె అనగానే  చిన్న ప్లేటు సైజులో చూసి ఉంటాం .. అంతకుమించితే కాస్తా పెద్ద సైజ్‌లో  చూసి ఉండవచ్చు  . అయితే చెన్నైకు చెందిన చెఫ్‌లు   ఒకటా ... రెండా ... ఏకంగా  100 అడుగల దోసెను తయారు చేసి గిన్నిస్‌ రికార్డు నెలకొల్పారు. ఈ అరుదైన రికార్డు ఐఐటీ –మద్రాçసు ఆవరణలో ఆవిషృతమైంది.ప్రముఖ చెఫ్, విద్యా వేత్త డాక్టర్‌  వినోద్‌కుమార్‌  సారథ్యంలో   శుక్రవారం సాయంత్రం  ఐఐటీ –మద్రాసు వేదికగా గిన్నిస్‌ రికార్డు  సాధన కోసం   100 అడుగుల పొగవు గల దోసె త యారు చేశారు.  ఇందులో నగరంలోని   శరవణ భవన్‌కు చెందిన 60మంది చెఫ్‌ల బృందం కలసి    ఏకకాలంలో  100 అడుగుల పొడవు సునాయాసంగా తయారు చేసి విజయవంతం చేశారు.  

100 అడుగుల  దోసెకు    37.5 కిలోల  పిండి ,   10 అడుగలు  రైస్‌ ఫ్లే్లవర్,  రెండుకిలోల చిక్‌పీస్‌ , గ్రీన్‌ గ్రామ్‌  500 గ్రాములు ,     500 గ్రాముల సాల్ట్, ఉపయోగించనట్టు  చెఫ్‌  వినోద్‌కుమార్‌  తెలిపారు.   2014 సంవత్సరంలో   అహ్మదాబాద్‌  లోని హోటల్‌ దాస్పల్లా పేరుమీదుగా ఉన్న    54 అడుగుల 8.69  లో ఉన్న రికార్డును బద్దలు కొట్టినట్టు ఆయన వెల్లడిం చారు. ఇందులో  శరవణ భవన్‌ జీఎం  మదన్, ఎండీ  హెచ్‌ఆర్‌ దామోదరన్‌ , నటుడు  నకుల్‌  ఆయన సతీమణి శృతి నకుల్‌ పాల్గొ్గన్నారు.

మరిన్ని వార్తలు