వలసదారులను ఆదుకుంటాం

29 Nov, 2013 23:32 IST|Sakshi
సాక్షి, న్యూఢిల్లీ: వలసదారులకు భరోసా ఇచ్చేందుకు పలు చర్యలు చేపడతామని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ‘దస్ దిన్ మే దస్ ఇరాదే’ పేరు తో శుక్రవారం అశోకా రోడ్డులోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, ఢిల్లీ సీఎం అభ్యర్థి డాక్టర్ హర్షవర్ధన్, బీజేపీ నగరశాఖ అధ్యక్షుడు విజయ్‌గోయల్ పాల్గొన్నారు. వల సలు అనేది మారుతున్న ప్రపంచంలో పెద్ద అంశం గా మారిందని రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ఇతర దేశాల్లో వలస వచ్చిన వారికి సరైన సదుపాయాలు కల్పించి గౌరవిస్తుండగా, భారతదేశంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రం వలసవాదులు ఆయా పట్టణాలకు భారమని భావించడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల నుంచి వలసవచ్చిన పౌరులపై సవతిప్రేమ చూపుతున్నారని సింగ్ విమర్శించారు. 
 
 వలసదారులకు అన్ని సదుపాయాలు కల్పిం చేందుకు బీజే పీ సిద్ధంగా ఉందన్నారు. యునెస్కో ఇటీవల విడుదల చేసిన నివేదికల్లోనూ వలసవాదులపై భారత్‌లో వివక్ష ఉన్నట్టు తెలిపిందన్నారు. ఉపాధి కోసం వేల మంది పట్టణాలకు వలస వస్తున్నారన్నారు. వీరందరికీ సరైన సదుపాయాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని 1,639 అనధికారిక కాలనీలు, 860 జుగ్గీజోపిడీ కాల నీలతోపాటు ఇతర ప్రాంతాల్లో ఎంతో మంది వలసవచ్చిన పేదలు ఉంటున్నారన్నారు. ఢిల్లీ జనాభాలో దాదాపు 49 శాతం మంది ఈ ప్రాంతాల్లోనే దయనీయంగా బతుకులీడుస్తున్నారని పార్టీ జాతీ య అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అటల్ బిహారీ వాజపేయి పునరావాస యోజన పథకాన్ని అమలులోకి తెచ్చి పేదలందరికీ సరైన సదుపాయాలు కల్పిస్తామని బీజేపీ ఢిల్లీ సీఎం అభ్యర్థి హర్షవర్ధన్ తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ఢిల్లీలో చేపట్టబోయే పనులను ఆయన ఈ సందర్భంగా వివరించారు.
 
మరిన్ని వార్తలు