సోమ్‌నాథ్‌ను తప్పించండి

11 Feb, 2014 00:41 IST|Sakshi
న్యూఢిల్లీ: న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతిని పదవి నుంచి తప్పించాలని రాష్ర్టపతి ప్రణబ్‌ముఖర్జీని బీజేపీ కోరింది. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు హర్షవర్ధన్ రాష్ర్టపతి భవన్‌లో సోమవారం ప్రణబ్‌ను కలసి ఓ వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా ఈ బృందం రాష్ట్రపతి దృష్టికి 15 అంశాలను తీసుకె ళ్లింది. అనంతరం హర్షవర్ధన్ మీడయాతో మాట్లాడుతూ ‘సోమ్‌నాథ్ రాజీనామా కోరాం. ఆఫ్రికా సంతతికి చెందిన మహిళల ఆవాసాల్లోకి అనుమతి లేకుండానే సోమ్‌నాథ్ లోపలికి వెళ్లారు. తనిఖీలు చేశారు. అసభ్యంగా ప్రవర్తించారు. మంత్రి చర్యలు పూర్తిగా చట్టవిరుద్ధం’అని అన్నారు. జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం శాసనసభ ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని ఆప్ నిర్ణయించిన విషయాన్ని కూడా రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు.  కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి పొందకుండానే నేరుగా జన్‌లోక్‌పాల్ బిల్లు ఆమోదం కోసం యత్నిస్తోందని ఆరోపించారు. ఆప్‌కు అందిన విరాళాలపై విచారణ జరిపించాలని కూడా రాష్ట్రపతిని కోరినట్టు తెలిపారు.
 
మరిన్ని వార్తలు