విద్యుత్ సుంకం పెరుగుదలపై హైవే దిగ్బంధం

11 Dec, 2013 00:16 IST|Sakshi
నాసిక్ : విద్యుత్, నీటి టారిఫ్‌లలో పెరుగుదలను నిరసిస్తూ పలు వ్యాపారసంఘాలు మంగళవారం ైెహ వేను దిగ్బంధించాయి. ఈ ఆందోళనకు మహా రాష్ట్ర నవ్‌నిర్మాణ్ సేన(ఎంఎన్‌ఎస్), బీజేపీ, ఆమ్ ఆద్మీపార్టీ, సీపీఎం అనుబంధ సీఐటీయూ మద్దతుగా ధర్నాలో పాల్గొన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటో తేదీనుంచి విద్యుత్ ధరలను పెంచుతూ విద్యుత్ కమిటీ నిర్ణయం తీసుకున్న విషయం తెలి సిందే. దాన్ని సవరించాలని కోరుతూ ఆందోళనకారులు తమ విద్యుత్ బిల్లులను రోడ్డుపై పడేసి తగులబెట్టారు. ఉదయం 10 గంటలకు అంబడ్ రిసప్షన్ క్లబ్ వద్ద ఆందోళనకారులు, మద్దతుదారులు చేరి, అక్కడినుంచి ర్యాలీగా వెళ్లి గర్వారే నాకా వద్ద ఉన్న 7.5 కి.మీ. ఫైఓవర్ బ్రిడ్జి ప్రవేశమార్గం వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనస్థలానికి చేరుకుని, ఆందోళనకారులను చెదరగొట్టి, సుమారు 200 మందిని అదుపులోకి తీసుకున్నారు.
 
నాసిక్ ఇండస్ట్రీస్, మానిఫెక్చరర్స్ అసోసియేషన్(ఎన్‌ఐఎంఏ) చైర్మన్ మనీష్ కొఠారీ, అంబడ్ ఇండస్ట్రీస్, మానిఫెక్చరర్స్ అసోసియేషన్ చైర్మన్ సురేష్ మాలి, ఎంఎన్‌ఎస్‌కు చెందిన శశికాంత్ జాదవ్, ఆప్ నేత జితేంద్ర భావే, బీజేపీ నగర శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్ శవాజీ, సీఐటీయూ నాయకుడు డీఎల్ కరద్, సీపీఎంకు చెందిన కార్పొరేటర్ తానాజీ జైభావే, ఎన్‌ఐఎంఏ మాజీ చైర్మన్ ధనంజయ్ బేలేలను  అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, విద్యుత్ టారిఫ్ సవరించేందుకు రాష్ర్ట రెవెన్యూ మంత్రి నారాయణ రాణే నేతృత్వంలో ఒక కమిటీని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ నియమించారు. అయితే ఆ కమిటీ ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
 
మరిన్ని వార్తలు