పుస్తక ప్రదర్శనలో ఎస్‌ఐబీఎఫ్

23 Feb, 2014 01:43 IST|Sakshi
పుస్తక ప్రదర్శనలో ఎస్‌ఐబీఎఫ్

 న్యూఢిలీ ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ నెల 15 నుంచి ప్రారంభమైన ఢిల్లీ పుస్తక ప్రదర్శన (డీబీఎఫ్)లో షార్జా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన (ఎస్‌ఐబీఎఫ్) కూడా పాలుపంచుకుంటోంది.
 
 
  ఈసారి సరికొత్త హంగులతో ప్రగతి మైదాన్‌లో కొనసాగుతున్న ఢిల్లీ ప్రపంచ పుస్తక ప్రదర్శన- 2014 ఆదివారంతో ముగుస్తుంది. దాదాపు 54 వేల చదరపు మీటర్ల భారీ వైశాల్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునెస్కో, ప్రపంచబ్యాంకు సహా దేశవిదేశాలకు చెందిన 1,070 ప్రచురణ సంస్థలు పాల్గొంటున్నాయి.
 
 
 ఎస్‌ఐబీఎఫ్ ప్రతినిధి అహ్మద్ బిన్ రక్కడ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘మిగతా దేశాల సంస్కృతుల గురించి తెలుసుకొని, వాటితో సత్సం బంధాలు పెంపొందించుకోవడానికే యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం డీబీఎఫ్‌లో పాల్గొనాలని నిర్ణయించింది. ఈ ఏడాది షార్జా ‘ఇస్లామిక్ సంస్కృతి రాజధాని’గా ఎంపికయినందున, మా నగరానికి సాంస్కృతిక కేంద్రంగా గుర్తింపు తేవడానికి, మా సంస్కృతిని చాటిచెప్పడానికి కూడా ఈ ప్రయత్నం ఉపకరిస్తుంది. భారత్‌తో సత్సంబంధాలు పెంపొందించుకోవడంలో భాగంగా ఇది వరకు మేం జైపూర్ సాంస్కృతిక ఉత్సవంలోనూ పాలుపంచుకున్నాం. షార్జాలో నవంబర్ 5-15 తేదీల్లో జరిగే పుస్తక ప్రదర్శనలో పాల్గొనాల్సిందిగా భారతీయ ప్రచురణ సంస్థలను కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం’ అని ఆయన వివరించారు.
 
 

మరిన్ని వార్తలు