...వారిపై క్రిమినల్ చర్యలు

30 Aug, 2015 04:54 IST|Sakshi
...వారిపై క్రిమినల్ చర్యలు

- బీపీఎల్ కార్డులు అక్రమంగా కలిగి ఉన్నవారికి మంత్రి హెచ్చరిక
- కార్డుల స్వాధీనానికి మరో రెండు నెలలు గడువు పెంపు
- కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, బెంగళూరు:
రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా బీపీఎల్ కార్డులు కలిగి ఉన్న వారు ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలని, అలా చేయని వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి దినేష్ గుండూరావ్ తెలిపారు. శనివారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో దినేష్ గుండూరావ్ మాట్లాడారు. అక్రమ బీపీఎల్ కార్డుదారులను తెలుసుకునేందుకు గాను ప్రత్యేక డ్రైవ్‌ను ఇప్పటికే ప్రారంభించినట్లు చెప్పారు.

ఈ డ్రైవ్‌లో ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తం గా దాదాపు రెండువేల మంది అక్రమ బీపీఎల్ కార్డుదారులను అధికారులు గుర్తిస్తున్నారని పేర్కొన్నా రు. ఇలాంటి వారందరికీ ప్రభుత్వం మరో రెండు నెలలు గడువు విధిస్తోం దని, ఈ గడువు పూర్తయ్యేలోగా వారంతట వారే బీపీఎల్ కార్డులను ప్రభుత్వానికి అందజేయాలని హెచ్చరించారు. ఇక కొత్త రేషన్‌కార్డుల పంపిణీ కోసం అర్జీలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ రేషన్ సరుకుల సరఫరాకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూసుకుంటున్నామని తెలి పారు.
 
ఇక ఇప్పటికే రాష్ట్రానికి అవసరమైన మోతాదులో ఆహార ధాన్యాలను కేంద్రం నుంచి కొనుగోలు చేసి ఉంచామని చెప్పారు. ఇంకా అవసరమైతే కేంద్ర ఆహార మండలి నుంచి మరిన్ని ఆహార ధాన్యాలను కొనుగోలు చేసేం దుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని దినేష్ గుండూరావ్ వెల్లడించారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు