కదం తొక్కిన కార్మికులు

31 Jul, 2013 08:08 IST|Sakshi
భవన నిర్మాణ రంగంలోని కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరణ, కార్మిక సంక్షేమ బోర్డు నిధి పెంపు తదితర డిమాండ్లతో మంగళవారం ఆందోళనకు ఏఐటీయూసీ, సీఐటీయూ, తోముసా తదితర ఎనిమిది సంఘాలు పిలుపు నిచ్చాయి. కార్మిక సంక్షేమ బోర్డు కార్యాలయాల ముట్టడికి నిర్ణయించాయి. రాష్ట్ర వ్యాప్త నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. 
 
పోలీసుల ఆంక్షల్ని ఉల్లంఘించి రాష్ట్ర వ్యాప్తంగా  ఆందోళనలు, ముట్టడి కార్యక్రమాలు మంగళవారం జరిగాయి. సీఐటీయూ, ఏఐటీయూసీ, తోముసా, డీఎంకే అనుబంధ కార్మిక విభాగం, ఎల్‌పీఎఫ్, పీటీసీ తదితర సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలో పాల్గొన్నారు. చెన్నైలో జరిగిన ఆందోళనలో ఎమ్మెల్యే సౌందరరాజన్, సీఐటీయూ నేతలు సుకుమార్, కాశీనాథన్, తోముసా నేత నటరాజన్, షణ్ముగం, డీఎంకే కార్మిక సంఘం నేత రత్న సభాపతి, ఎల్‌పీఎఫ్ నేత నటరాజన్, పీటీసీ నేత సుబ్రమణ్యం, ఏఐటీయూసీ నేతలు సత్యనాగరాజన్, శ్రీధర్, పరమశివం, కార్మికులు పాల్గొన్నారు. ర్యాలీగా వెళ్లి తేనాంపేట బీఎంఎస్ ఆవరణలోని కార్మికశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. వీరిని ప్రధాన ద్వారం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. 
 
 కాసేపు అక్కడ బైఠాయించి ఆందోళనకారులు నినాదాలతో హోరెత్తించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చివరకు పోలీసు వలయాన్ని ఛేదిస్తూ ముందుకు దూసుకెళ్లేందుకు ఆందోళనకారులు యత్నించారు. ఈ క్రమంలో తోపులాట, వాగ్యుద్ధం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే సౌందరరాజన్‌తో సహా నాయకులు, కార్యకర్తలు పదిహేను వందల మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరందరినీ రాజరత్నం స్టేడియం సమీపంలోని కమ్యూనిటీ హాల్స్‌లో సాయంత్రం వరకు ఉంచారు. తర్వాత విడిచి పెట్టారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనలు కొనసాగుతాయని, మరో భారీ నిరసనకు సన్నాహాలు చేస్తున్నామని కార్మిక సంఘాల నేతలు పేర్కొన్నారు.కార్యాలయాల ముట్టడికి నిర్ణయించాయి. రాష్ట్ర వ్యాప్త నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించారు.
 
పోలీసుల ఆంక్షల్ని ఉల్లంఘిం చి రాష్ట్ర వ్యాప్తంగా  ఆందోళనలు, ముట్టడి కార్యక్రమాలు మంగళవారం జరిగాయి. సీఐటీయూ, ఏఐటీయూసీ, తోముసా, డీఎంకే అనుబంధ కార్మిక విభాగం, ఎల్‌పీఎఫ్, పీటీసీ తదితర సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలో పాల్గొన్నారు. చెన్నైలో జరిగిన ఆందోళనలో ఎమ్మెల్యే సౌందరరాజన్, సీఐటీయూ నేతలు సుకుమార్, కాశీనాథన్, తోముసా నేత నటరాజన్, షణ్ముగం, డీఎంకే కార్మిక సంఘం నేత రత్న సభాపతి, ఎల్‌పీఎఫ్ నేత నటరాజన్, పీటీసీ నేత సుబ్రమణ్యం, ఏఐటీయూసీ నేతలు సత్యనాగరాజన్, శ్రీధర్, పరమశివం, కార్మికులు పాల్గొన్నారు. ర్యాలీగా వెళ్లి తేనాంపేట బీఎంఎస్ ఆవరణలోని కార్మికశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. వీరిని ప్రధాన ద్వారం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. 
 
కాసేపు అక్కడ బైఠాయించి ఆందోళనకారులు నినాదాలతో హోరెత్తించారు. తమ డిమాండ్ల ను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చివరకు పోలీసు వలయాన్ని ఛేదిస్తూ ముందుకు దూసుకెళ్లేందుకు ఆందోళనకారులు యత్నిం చారు. ఈ క్రమంలో తోపులాటలు, తీవ్ర వాగ్యుద్ధం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే సౌందరరాజన్‌తో సహా నాయకులు, కార్యకర్తలు పదిహేను వందల మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరందరినీ రాజరత్నం స్టేడియం సమీపంలోని కమ్యూనిటీ హాల్స్‌కు తరలించి సాయంత్రం వరకు ఉంచారు. తర్వాత అందరినీ విడిచి పెట్టారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనలు కొనసాగుతాయని, మరో భారీ నిరసనకు సన్నాహాలు చేస్తున్నామని కార్మిక సంఘాల నేతలు పేర్కొన్నారు.
మరిన్ని వార్తలు