చోరీకి వెళ్లిన దొంగకు చిర్రెత్తుకొచ్చింది...

3 Aug, 2019 09:06 IST|Sakshi

గల్లాలో చిల్లిగవ్వ కూడా పెట్టకపోతే దొంగతనాలు ఎలా చెయ్యాలి?

దుకాణ యజమానికి ఓ దొంగ లేఖ 

సాక్షి, చెన్నై: దొంగతనానికి వచ్చిన చోట చిల్లిగవ్వ దొరక్కపోవడంతో ఓ దొంగ చిర్రెత్తిపోయాడు. ఆ దుకాణ యజమానికి ఓ లేఖ రాసి చీవాట్లు పెట్టి వెళ్లాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. కడలూరు జిల్లా మందారకుప్పంలో జయరామన్‌ అనే వ్యక్తి కిరాణా దుకాణం నడుపుతున్నాడు. నిత్యం రద్దీగా ఉండే ఈ దుకాణంపై ఓ దొంగ కన్నేశాడు. గురువారం అర్ధరాత్రి అతి కష్టం మీద దుకాణం పై కప్పును తొలగించి లోపలికి వెళ్లాడు. ఉదయాన్నే దుకాణం తెరచిన జయరామన్‌ షాక్‌కు గురయ్యాడు. పైకప్పు దెబ్బతిన్నా దుకాణంలో వస్తువులు ఏమాత్రం చోరీకి గురి కాలేదు.

అయితే కొన్ని వస్తువులు చిందరవందరగా పడి ఉండటంతో వాటిని సరి చేస్తుండగా ఓ లేఖని గుర్తించాడు. ప్రాణాలను పణంగా పెట్టి అతి కష్టం మీద దొంగతనానికి వస్తే గల్లాలో చిల్లిగవ్వ కూడా పెట్టవా? అని అందులో యజమానిని దొంగ ప్రశ్నించాడు. దొంగతనం చేయడం అంత సులభం కాదని..ఎంతో కష్టపడాల్సి ఉందని ఇక్కడున్న పప్పుదినుసులను పట్టుకెళ్లి తానేమి చేసుకోవాలని విచారం వ్యక్తం చేశాడు. ఈ లేఖపై పోలీసులు విచారణ చేస్తున్నారు. 


 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇంటి ముందు నాగరాజు ప్రత్యక్షం

ఇందిరానగర్‌ మెట్రో స్టేషన్‌లో పిల్లర్‌ చీలిక

ముస్లిం మహిళలపై అనుచిత వ్యాఖ్యలు

చినజీయర్‌ ఆశీస్సుల కోసం వచ్చా....

మిడ్‌నైట్‌ మెట్రో

పోలీస్‌స్టేషన్‌లో ప్రేమ పెళ్లి

కాఫీ కింగ్‌కు కన్నీటి వీడ్కోలు

కూలిన బ్యాంకు పైకప్పు..

కాఫీ డే ‘కింగ్‌’ కథ విషాదాంతం

చెత్తే కదా అని పారేస్తే..

ప్రమాదకర స్థాయిలో గోదావరి..

అంత డబ్బు మా దగ్గర్లేదు..

జాతకం తారుమారు అయ్యిందా? 

చిల్లీ చికెన్‌కు ఆషాడం ఆఫర్‌

తమ్ముడితో ఏకాంతంగా మాట్లాడిన నళిని

1000 కిలోల మేకమాంసంతో విందు

ఇకపై భార్య‘లు’ ఉంటే క్రిమినల్స్‌ కిందే లెక్క..!

శ్మశానంలో శివపుత్రుడు

ఎన్నాళ్లో వేచిన హృదయం

ముగ్గురు రెబల్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

ఎట్టకేలకు పెరోల్‌పై విడుదలైన నళిని

పూటుగా తాగి రైలుకు ఎదురెళ్లాడు

చీరకట్టులో అదుర్స్‌

సీఎం జగన్‌పై ప్రముఖ తమిళ పార్టీ ప్రశంసల జల్లు

బెంగళూరులో 144 సెక్షన్‌

క్లైమాక్స్‌కు చేరిన కన్నడ రాజకీయాలు

లతారజనీకాంత్‌ సంచలన వీడియో

ముఖ్యమంత్రిని కిడ్నాప్‌ చేస్తా!

డుమ్మా కొడితే దొరికిపోతారమ్మా!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ద్విపాత్రాభినయం

నటుడు విశాల్‌కు అరెస్ట్‌ వారెంట్‌

అలా చేశాకే అవకాశమిచ్చారు!

గుణ అనే పిలుస్తారు

తుగ్లక్‌ దర్బార్‌లోకి ఎంట్రీ

వసూళ్ల వర్షం పడుతోంది