బస్సు చార్జీలు పెరగవు

22 May, 2015 05:15 IST|Sakshi

- రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి
సాక్షి, బెంగళూరు
: కేఎస్‌ఆర్‌టీసీ, బీఎంటీసీల్లో ఇప్పట్లో బస్‌చార్జీల పెంపు ఉండబోదని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డివెల్లడించారు. డీజిల్ ధరలు పెరిగినప్పటికీ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని చార్జీలను పెంచలేదని వివరించారు. ఈ నిర్ణయం ద్వారా రోడ్డు రవాణా సంస్థపై రూ.396కోట్ల భారం పడనుందని రామలింగారెడ్డి పేర్కొన్నారు. గురువారమిక్కడ తనను కలిసిన విలేకరులతో రామలింగారెడ్డి మాట్లాడారు. ఆరు నెలల క్రితం కేఎస్‌ఆర్‌టీసీ, బీఎంటీసీ చార్జీలను పెంచిన నేపథ్యంలో నష్టాలు కాస్తంత తగ్గాయని తెలిపారు. బీఎంటీసీలో ఖాళీగా ఉన్న 700 ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు చెప్పారు. రోడ్డు రవాణా సంస్థలోని ఉద్యోగుల బదీలలకు సంబంధించి మొట్టమొదటి సారిగా మార్గదర్శకాలను రూపొందించినట్లు వెల్లడించా రు. ప్రస్తుతం బీఎంటీసీతోపాటు కేఎస్‌ఆర్‌టీసీ

ఇతర విభాగాలతో కలిపి రోడ్డు రవాణా సంస్థలో మొత్తం 1.2లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. ఉద్యోగుల బదిలీల్లో పారదర్శకతను పాటించేందుకు గాను ఈ మార్గదర్శకాలను రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈనెల 25 నుంచి 30 లోపు ఉద్యోగుల బదిలీల ప్రకియను పూర్తి చేయనున్నట్లు మంత్రి రామలింగారెడ్డి వెల్లడించారు.

మరిన్ని వార్తలు