మంత్రివర్గ ఉప సంఘం భేటీ

28 Apr, 2017 15:31 IST|Sakshi
మంత్రివర్గ ఉప సంఘం భేటీ
అమరావతి: ఇసుక మాఫియా కట్టడి, ఇసుక విధానంపై మంత్రివర్గ ఉప సంఘం శుక్రవారం సమావేశమయింది. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి  కేఈ కృష్ణమూర్తి, హోం శాఖ మంత్రి చినరాజప్ప, గనుల శాఖ మంత్రి సుజయకృష్ణ రంగారావుతో పాటు కృష్ణా, గుంటూరు కలెక్టర్లు, రెవెన్యూ, హోం, విజిలెన్స్, మైనింగ్ శాఖాధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఇసుక అక్రమాలపై ఇప్పటివరకు నాలుగు వేల ఫిర్యాదులు వచ్చాయని, మొత్తం 189 కేసులు నమోదైనట్లు, 257 మందిని అరెస్టు చేసినట్లు, 465 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. 337 చోట్ల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని, 212 చోట్ల సాధారణ ప్రజలను ఇసుక తవ్వకుండా బెదిరిస్తున్నారని ప్రభుత్వానికి సమాచారముందని, వీటిపై దృష్టి సారించనున్నట్లు మంత్రులు, అధికారులు పేర్కొన్నారు.
మరిన్ని వార్తలు