‘కాల్, టచ్’తో ఉచితంగా సంపూర్ణ సమాచారం

23 Jun, 2014 02:22 IST|Sakshi
  • అందుబాటులోకి తెచ్చిన ‘కాల్ టు క్యాచ్’
  •  సాక్షి, బెంగళూరు : బీటీఎం నుంచి ఇందిరానగరకు ఎలా వెళ్లాలి? సెంట్రల్ మాల్ ఎక్కడ ఉంది? హైకోర్టుకు వెళ్లడానికి ఏ బస్ ఎక్కాలి? వంటి సమాచారం కోసం ఇక నుంచి ఇబ్బంది పడాల్సిన పనిలేదు. ఎవరిని అడగాలి అని కంగారు వద్దు. ఒక క్లిక్, కాల్, టచ్ వీటిలో ఏదైనా సరే ఈ సమాచారాన్నంతా మీ ముందు చిటికెలో ఉంచేస్తుంది. ఇలాంటి ఓ అధునాతన సాఫ్ట్‌వేర్‌ను ‘కాల్ టు క్యాచ్.కామ్’ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది.

    ఈ సాఫ్ట్‌వేర్‌ను శాండల్‌వుడ్ నటి రూపిక, సంస్థ సీఈఓ చంద్రశేఖర్ ఆదివారమిక్కడ నిర్వహించిన కార్యక్రమంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ సాఫ్ట్‌వేర్ పనిచేసే విధానాన్ని చంద్రశేఖర్ మీడియాకు వివరించారు. ‘బెంగళూరులోని వ్యక్తులు బెంగళూరుకు 100చదరపు కిలోమీటర్ల పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, వ్యాపార సంస్థలు, పర్యాటక ప్రాంతాలు, విద్యాసంస్థలు, పరిశోధనా కేంద్రాలు తదితర 32 విభాగాలకు చెందిన పూర్తి వివరాలను 7829292929కు కాల్ చేయడం(కాల్ ఉచితం) ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు.

    ఇక ఆయా ప్రాంతాలకు వెళ్లడానికి ఏ బస్ ఎక్కాలి అనే సమాచారం కూడా అందిస్తామని పేర్కొన్నారు. అంతేకాక ఈ వివరాలన్నింటిని తెలిపే 18 కియోస్క్‌లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. నగరంలోని ప్రముఖ మాల్స్, జనసందోహ ప్రాంతాల్లో ఈ కియోస్క్‌లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
     
    ఇందులో ఉన్న అధునాతన టచ్ స్క్రీన్ సహాయంతో తమకు కావలసిన సమాచారాన్ని ఉచితంగా తెలుసుకోవ చ్చని తెలిపారు. ఇక ఆండ్రాయిడ్ ఫోన్లలో సైతం ఝఛ్చి2ఛ్చ్టిఛిజి.ఛిౌఝ ఆప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని వివరాలను తెలుసుకోవచ్చని చెప్పారు. ముఖ్యంగా బెంగళూరుకు మొదటిసారిగా వచ్చే గ్రామీణ యువతతో పాటు పర్యాటకులకు ఈ సేవలు ఎంతగానో ప్రయోజనం చేకూర్చుతాయని చంద్రశేఖర్ వెల్లడించారు.
     

మరిన్ని వార్తలు