పళని శిబిరం నుంచి మరో ఎమ్మెల్యే జంప్‌

18 Feb, 2017 09:03 IST|Sakshi
పళని శిబిరం నుంచి మరో ఎమ్మెల్యే జంప్‌

చెన్నై: అన్నా డీఎంకే రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. ఈ రోజు తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి పళనిస్వామి ఎదుర్కొనే బలపరీక్షపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. కాసేపట్లో బలపరీక్ష జరగనుండగా, పళనిస్వామి శిబిరం నుంచి మరో ఎమ్మెల్యే జంప్ అయ్యారు. అసెంబ్లీలో పళనిస్వామికి మద్దతుగా ఓటు వేయబోనని ఎమ్మెల్యే అరుణ్‌ కుమార్ ప్రకటించారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం గూటికి చేరారు.

నిన్నరాత్రి వరకు పళనిస్వామి శిబిరంలో 123 మంది ఎమ్మెల్యేలు ఉండగా, అరుణ్‌ కుమార్‌ జంప్ కావడంతో ప్రస్తుతం 122 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బలపరీక్షలో పళనిస్వామి నెగ్గాలంటే 117 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. పన్నీరు సెల్వం శిబిరంలో 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నిన్న కోయంబత్తూరు ఎమ్మెల్యే నటరాజన్ పన్నీరు సెల్వం వర్గంలో చేరారు. మరికొంత మంది ఎమ్మెల్యేలు పళనిస్వామిని వ్యతిరేకిస్తున్నట్టు వార్తలు రావడంతో ఈ రోజు బలపరీక్షలో ఏం జరగబోతోందనే దానిపై ఉత్కంఠ ఏర్పడింది. బలపరీక్షలో డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేయనున్నాయి.

మరిన్ని తమిళనాడు విశేషాలు..

భారీ భద్రతతో బయల్దేరిన ఎమ్మెల్యేలు

మొన్నటివరకు గవర్నర్.. నేడు స్పీకర్!

బలపరీక్షకు కరుణానిధి దూరం!

ఎవరీ సైనైడ్ మల్లిక!

పళనిస్వామిని ఓడించండి: రాహుల్

అమ్మకు ఓటేయండి

నన్ను చూసి నవ్వొద్దు

‘మ్యాజిక్‌’ చేసేదెవరు?