పాతనోట్లు చలిమంట

19 Sep, 2018 13:27 IST|Sakshi
కాలిపోగా మిగిలిన పాత నోట్ల ముక్కలు

రాయచూరు రూరల్‌: అది రాయచూరు నగరంలోని గంజ్‌ సర్కిల్‌ ప్రాంతం. ఒక మూలన ఏవో కాగితాలు తగలబడుతున్నాయి. కొందరు అనుమానం వచ్చి చూస్తే.. అవి 500, 1000 రూపాయల నోట్లు. దీంతో గగ్గోలు మొదలైంది. కాకపోతే అవి రద్దయిన పాత నోట్లు.  ఇక్కడి ఏపీఎంసీ మార్కెట్‌లోని వ్యాపారులు ఎవరైనా పాత నోట్లను అలాగే ఉంచుకుని ఉంటారు, మార్పిడికి చేతకాక  అంటించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో పాత కరెన్సీ నోట్లను కాల్చి బూడిద చేశారు. దీనిపై మార్కెట్‌ యార్డ్‌ ఎస్‌ఐ అగ్ని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సమాచారం తెలియగానే జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి వెంకటరావ్‌ నాడగౌడ ఘటన స్థలాన్ని సందర్శించారు. పాతనోట్ల రద్దయిన దాదాపు రెండేళ్ల తరువాత కూడా అవి బయటకు రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎంతమొత్తంలో కాల్చి ఉంటారనేదానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు