కావేరి సెగతో మారిన పెళ్లి వేదిక

15 Sep, 2016 08:33 IST|Sakshi
కావేరి సెగతో మారిన పెళ్లి వేదిక

తమిళనాడుకు తరలిన పెళ్లి బృందం
హోసూరు:
కావేరి జల వివాదం నేపథ్యంలో బెంగళూరులో జరుగుతున్న అల్లర్లతో అక్కడ జరగాల్సిన పెళ్లి తమిళనాడుకు మారింది. తిరువణ్ణామలైకు చెందిన రంజిత్‌(25) బెంగళూరులో భవన నిర్మాణకార్మికుడుగా పని చేస్తున్నాడు. రంజిత్‌కు తిరువణ్ణామలైకే చెందిన సౌమ్యతో బుధవారం బెంగళూరులో పెళ్లి జరిపేందుకు ముహుర్తం నిర్ణయించారు. ఆహ్వాన పత్రికలూ ముద్రించారు. పెళ్లి పీటలు సిద్ధమయ్యాయి. కానీ బెంగళూరులో ఉద్రిక్తత కొనసాగుతుండటంతో  కర్ఫ్యూ విధించారు.

ఈ నేపథ్యంలో పెళ్లి చేయడం సాధ్యం కాదని గ్రహించిన పెళ్లి బృందం మొత్తం సామగ్రి సర్దుకొని తమిళనాడులోని తిరువణ్ణామలైకు తరలివెళ్లారు. వీరు బెంగళూరు నుండి అత్తిపల్లి వరకు కర్ణాటక బస్సులో అక్కడి నుండి కిలోమీటర్‌ దూరం పెళ్లి దుస్తులతోనే నడచి వచ్చి జూజువాడి వద్ద తమిళనాడు ఆర్టీసీ బస్సులలో తిరువణ్ణామలైకు వెళ్లారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు