బలిదానం!

17 Sep, 2016 01:49 IST|Sakshi
బలిదానం!

 విఘ్నేష్ ఆత్మాహతితో పరిస్థితి ఉద్రిక్తం
 శోకసంద్రంలో కుటుంబం
 నేడు అంత్యక్రియలు
 తిరువారూర్‌లో భద్రత కట్టుదిట్టం

 
 సాక్షి, చెన్నై: కావేరి జలాల వివాదం నేపథ్యంలో విఘ్నేష్ ఆత్మాహుతికి పా ల్పడడం తమిళనాడులో ఉద్రిక్తతకు కారమవుతోంది. ఈ సంఘటన ఈ ప్రాంతంలో తీవ్ర అలజడి రేపింది. తమిళులకు భాషాభిమానం ఎక్కువే. ప్రపంచ దే శాల్లో ఎక్కడైనా తమిళుడికి చిన్న హాని జరిగినా, తమిళనాట నిరసనలు భగ్గుమంటాయి. శ్రీలంకలో యుద్ధం సమయంలో తమిళులపై సాగిన నరమేథం ఇక్కడి హృదయాల్ని పిండేశాయి. నిరసనల హోరు ఓ వైపు అప్పట్లో సాగితే, ముత్తుకుమార్ ఆత్మాహుతి బలిదానం కలకలాన్ని రేపాయి.
 
 తదుపరి పదుల సంఖ్యలో ఆ బాటను అనుసరించిన తమిళాభిమానులు ఎక్కువే. ఈ పరిస్థితుల్లో కర్ణాటకలో జల వివాదం రేపిన చిచ్చు తమిళులపై ప్రతాపానికి దారి తీయడం, ఇక్కడి వర్గాల్లో ఆక్రోశాన్ని రగిల్చాయి. కర్ణాటక చర్యల్ని ఎండగడుతూ తమిళాభిమానులు, రాజ కీయ పక్షాలు కదిలాయి. ఈ నిరసనల్లో ఎవరైనా ఆత్మాహుతి, ఆత్మహత్యాయత్నాలు వంటి  అఘాయిత్యాలకు పాల్పడుతారేమోనన్న బెంగ సర్వత్రా వెంటాడుతూ వచ్చింది. ఆ ప్రయత్నాల జోళికి ఎవ్వరూ వెళ్లకూడదని ప్రార్థించారు.  , అది పునరావృతం అయినట్టుగా గురువారం నామ్ తమిళర్ కట్చి ర్యాలీలో ఘటన చోటు చేసుకుంది.
 
 అమరుడు..
 నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్, సీని దర్శకులు అమీర్, చేరన్‌ల నేతృత్వంలో గురువారం సాయంత్రం చెన్నైలో కావేరి జలాల కోసం గళం విప్పుతూ సాగిన భారీ ర్యాలీలో విఘ్నేష్ అనే యువకుడు కావేరి కోసం తనను తాను ఆర్పించుకుని ఆహుతి కావడం కలకలాన్ని రేపింది. తీవ్రగాయాలతో చెన్నై కీల్పాకం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విఘ్నేష్ శుక్రవారం ఉదయం పద కొండున్నర సమయంలో విగత జీవిగా మారడం నామ్ తమిళర్ కట్చి వర్గాల్ని, అతడి కుటుంబీకుల్ని శోక సంద్రంలో ముంచింది. విఘ్నేష్ ఇక లేడన్న సమాచారంతో, ఇలాంటి ప్రయత్నాలు ఎవ్వరూ చేయవద్దంటూ రాజకీయ పక్షాలు తమిళాభిమానులకు విజ్ఞప్తి చేసే పనిలో పడ్డాయి.
 
 అలాగే, రెచ్చగొట్టే వ్యాఖ్యల్ని చేయవద్దని నాయకులకు ప్రజా సంఘాలు విన్నవించే పనిలో పడ్డాయి. విఘ్నేష్ తనకు సోదరుడు లాంటి వాడు అని, అతడు బతికి ఉంటే, కుటుంబానికి ఏమి చేసి ఉంటా డో అదే తాను చేస్తానని ఈసందర్భంగా సీమాన్ వ్యాఖ్యానించారు. విఘ్నేష్ భౌతిక కాయం వద్ద సీమాన్ కన్నీళ్ల పర్యంతం అయ్యారు. వీసీకే నేత తిరుమావళవన్ అక్కడికి చేరుకుని నివాళులర్పించారు. ప్రజా సంఘాలు, తమిళాభిమాన సంఘాల నాయకులు తరలి రా వడంతో కీల్పాకం ఆసుపత్రి ఆవరణలో ఉత్కంఠ నెలకొంది. దీంతో పెద్ద ఎత్తున బలగాల్ని అక్కడ మోహరింప చేశారు.
 
 నేడు అంత్యక్రియలు..
 తిరువారూర్ జిల్లా మన్నార్ కుడి సమీపంలోని గోపాల సముద్రం గ్రామానికి చెందిన పాండియన్, షెన్బగలక్ష్మి దంపతుల కుమారుడు విఘ్నేష్. అతడి జనని సోదరి ఉన్నారు. నామ్ తమిళర్ కట్చి  తిరువారూర్ ఉత్తరం జిల్లా విద్యార్ధి విభాగం కార్యదర్శిగా వ్యవహరిస్తూ, చెన్నై అంబత్తూరులోని ఓ సంస్థలో పని చేస్తున్నాడు. సీమాన్ మీద గౌరవం, తమిళాభిమానం నాలుగు రాళ్లు తనకు ఎక్కువే అన్నట్టుగా వ్యవహరించే విఘే్‌‌న ష బుధవారం తన ఫెస్‌బుక్‌లో ఈ ఆత్మాహుతి గురించి ముందుగానే ప్రకటించి ఉన్నా డు. గురువారం జరిగే ర్యాలీలో కావేరి కోసం  ఆత్మాహుతులతో ముందుకు సాగుదామన్న అతడు పిలుపు ఇచ్చి ఉండటం వెలుగులోకి వచ్చింది.
 
 విద్యార్థులకు పిలుపు నిస్తూ ఓ లేఖను సందించి ఉండటంతో , ఇక , మరో బలిదానం అన్నది రాష్ట్రంలో జరగకూడదన్న అప్రమత్తత పెరిగి ఉన్నది. కాగా, విఘ్నేష్ భౌతిక కాయానికి శని వారం గోపాల సముద్రంలో అంత్యక్రియలు జరగనున్నాయి. పోస్టుమార్టం అనంతరం మృత దేహాన్ని  చెన్నై నుంచి స్వగ్రామానికి తరలించారు. పెద్ద సంఖ్యలో అంత్యక్రియలకు తమిళాభిమానులు తరలివచ్చే అవకాశంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. తిరువారూర్ జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
 

మరిన్ని వార్తలు