నిద్రలో ‘నిఘా’ నేత్రం!

28 Sep, 2014 21:59 IST|Sakshi

సాక్షి, ముంబై: నవీముంబైలో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తున్న వారికి ఈ- చలాన్‌ను జారీ చేసేం దుకు నవీముంబై మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్‌ఎంఎంసీ) రోడ్లపై ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల సేవలు నిలిచిపోయాయి. కార్పొరేషన్ దీనికి సం బంధించిన బిల్లులను ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ఐపీఎస్)కు చెల్లించడంలో విఫలమైంది. దీంతో నవీముంబై నగర రోడ్లపై పర్యవేక్షణ కొరవడింది. నవీముంబైలోని ముఖ్య కూడళ్లలో 262 హై డెఫినేషన్ కెమరాలను రిలయన్స్ కమ్యూనికేషన్ వారు అమర్చారు. అన్ని కెమరాలకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చి కంట్రోల్ రూంకు అనుసంధానం చేశారు. అయితే కార్పొరేషన్ ఈ సేవలకు గాను కంపెనీకి డబ్బులు చెల్లించకపోవడంతో సదరు కంపెనీ ఈ సేవలను నిలిపివేసింది.
 
సీసీ టీవీ కంట్రోల్ రూం అధికారులు అందజేసిన వివరాల మేరకు.. ఈ సేవలను అందించిన రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు.. కార్పొరేషన్ దాదాపు రూ.45 లక్షలను బకాయి పడింది. వీటి చెల్లింపుల జాప్యంతో రిలయన్స్ ఎనర్జీ ఈ సేవలను నిలిపివేసింది. దీంతో ఒక్క కెమె రా కూడా పని చేయడం లేదు. ఈ నేపథ్యంలో నవీ ముంబై నగర రోడ్లపై ఎలాంటి నిఘా లేకుండా పోయిందని అధికారి విచారం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ వ్యవస్థను క్రమబద్ధీకరించేందుకు ఈ ఏడా ది ఆగస్టు ఒకటో తేదీ నుంచి సీసీటీవీ కెమెరాలను అందుబాటులోకి తెచ్చారు. వీటివల్ల ట్రాఫిక్ నియమోల్లంఘన చేస్తున్నవారిపై సత్వరమే చర్యలు తీసుకునేందుకు అధికారులకు వీలు కలిగింది. కాగా, ఇప్పటివరకు 200 మంది ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ కెమెరాలకు చిక్కారు. వీరిపై పోలీ సులు కేసులు నమోదు కూడాచేశారు.
 
ఇందు లో 70 మంది వాహనదారులు జరిమానాలు చెల్లించారు. అయితే నియమాలు ఉల్లంఘించిన వాహన దారు లు జరిమానాలను నగరంలోని ఆయా ట్రాఫిక్ కార్యాల యాలలో చెల్లించవచ్చు లేదా నవీముంబై ట్రాఫిక్ పోలీస్ వెబ్‌సైట్‌ను ఆశ్రయిం చి కూడా వీరు జరిమానాలు చెల్లించవచ్చు. ప్రస్తుతం కెమెరాలు పనిచేయక పోవడంతో ఈ-చలాన్ జారీ చేసే వ్యవస్థ కూడా నిలిచిపోయిందని, అత్యవసర సమయంలో స్పందించడం కూడా కష్టంగా మారిందని ట్రాఫిక్ అధికారి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిఘా నేత్రాల సేవలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారి సంఖ్య 50 శాతం పెరిగిపోయిందని అధికారి పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు