కోట్ల ప్రచారం కొట్లాటతో పోయిందే!

27 Jun, 2013 19:49 IST|Sakshi
కోట్ల ప్రచారం కొట్లాటతో పోయిందే!
టీడీపీ అధినేత చంద్రబాబు ఏ పనిచేసినా మీడియాలో ప్రచారం వచ్చిందో లేదో చూస్తారు. రోజూ మీడియాలో ఎంత మైలేజీ వచ్చిందో లెక్కలేసుకుంటారు. ఇప్పుడు ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకుపోయిన వారిని రాష్ట్రానికి తరలించే విషయంలోనూ అదే తీరట! వరదల్లో చిక్కుకున్న వారిని రాష్ట్రానికి చేర్చడానికి టీడీపీ రెండు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది. కొందరికి ఆర్థిక సహాయం కూడా అందించింది. బాబూ రెండుసార్లు డెహ్రాడూన్ వెళ్లారు. జాతీయ స్థాయిలో ప్రచా రం రాకపోయినా రాష్ట్రంలో మాత్రం విపరీతమైన ప్రచారం వచ్చిందని తెగ సంబ రపడిపోయారట. రెండు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసినందుకు 50 లక్షలు రూపాయలకుపైనే ఖర్చయింది. అదనంగా మరో 25 లక్షల వరకూ బాధితులకు సాయం చేశారట.
 
అటుఇటుగా రూ.కోటి ఖర్చయితే అయ్యింది గానీ తెలుగు మీడియాలో మాత్రం దానికి వంద రెట్ల ప్రచారం వచ్చింది. ప్రభుత్వంకంటే మనకే మైలేజీ, ప్రచారం ఎక్కువగా వచ్చింది. మనం చేసిన ఖర్చుకన్నా వంద రెట్లు అధికంగా ఈ ప్రచారం వచ్చింది. ఇలాంటి బంపర్ ఆఫర్లు వచ్చే ఎన్నికల్లోగా ఇంకో రెండో మూడో తగిలితే ఇక మాకు తిరుగుండదని ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ నేతలు ఆనందపడిపోతున్న టైమ్‌లోనే డెహ్రాడూన్‌లో బాధితుల సమక్షంలోనే బాబు బృందం ప్రవర్తన తెలుగువారి ప్రతిష్ట జాతీయస్థాయిలో గంగలో కలిపేసిందని తెలిసి విస్మయపోయారు. అప్పటివరకు ఆనందంలో ఉన్న నేతలు ఒక్కొక్కరుగా బైటపడుతూ.. లక్షల ఖర్చుతో కోట్ల ప్రచారం వచ్చిందనుకుంటే జాతీయ స్థాయిలో తెలుగువారి ప్రతిష్టనే గంగలో కలిపారని చెవులు కొరుక్కున్నారు. 
>
మరిన్ని వార్తలు