ఎఫ్‌ఆర్‌బీఎంపై కేంద్రానికి బాబు లేఖ

13 Oct, 2016 15:35 IST|Sakshi

 ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ యాక్టు (ఎఫ్‌ఆర్‌బీఎంఏ)ను సవరించి, ఏపీకి వెసులుబాటు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరనుంది. ఈ నెల18 నుంచి ఢిల్లీలో జరిగే ఆర్థిక మంత్రుల సమావేశంలో మంత్రి యనమల రామకృష్ణుడు కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ వద్ద ఈ మేరకు ప్రతిపాదనలు అందించనున్నారు. ఎఫ్‌ఆర్‌బీఎంను 3 నుంచి 3.5 శాతానికి పెంచాలని ఇందులో కోరనున్నారు. కేంద్ర గనుక అనుమతిస్తే అదనంగా రాష్ట్రానికి రూ.3వేల కోట్లు నిధులు రుణంగా సమకూరనున్నాయి. కాగా, ఇందుకు సంబంధించి సీఎం చంద్రబాబు ఇప్పటికే లేఖ కూడా రాశారని అధికారులు తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు