అసెంబ్లీకి కసరత్తు

13 Aug, 2015 03:02 IST|Sakshi
అసెంబ్లీకి కసరత్తు

సమీక్షల్లో మంత్రులు బిజీ
  21 నుంచి ప్రారంభమయ్యే అవకాశం
  సమావేశం కోసం గవర్నర్‌కు విజయకాంత్ వినతి
 
 సాక్షి, చెన్నై : మార్చిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ఆ సమయంలో సీఎంగా పన్నీరు సెల్వం ఉన్నారు. బడ్జెట్ దాఖలుతో సభను వాయిదా వేశారు. అయితే, శాఖల వారీగా నిధుల కేటాయింపులపై చర్చే జరగలేదు. ఈ నేపథ్యంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నుంచి అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నిర్దోషిగా విడుదలయ్యారు. మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టారు. ప్రభుత్వ వ్యవహారాలపై దృష్టి సారించే పనిలో జయలలిత నిమగ్నం అయ్యారు. ఆమె సీఎంగా పగ్గాలు చేపట్టినానంతరం అసెంబ్లీని సమావేశ పరచలేదు. అదే సమయంలో తాజాగా రాష్ట్రంలో ఓ వైపు టాస్మాక్ మద్యానికి వ్యతిరేకంగా నిరసనలు బయలుదేరి ఉండడం, ఎన్‌ఎల్‌సీ కార్మికులు సమ్మెబాట పట్టి ఉండడం, సమాచార కమిషనర్లు నియామకం వివాదానికి దారి తీసి ఉండడం తదితర పరిణామాలు చోటు చేసుకుని ఉన్నాయి.
 
  ఈ సమయంలో అసెంబ్లీని తక్షణం సమావేశ పరచాలన్న డిమాండ్‌ను ప్రతి పక్షాలు తెర మీదకు తెచ్చాయి. బడ్జెట్ కేటాయింపులపై చర్చలు సాగని దృష్ట్యా, సభను సమావేశ పరిచి అందుకు తగ్గ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. సమీక్షల్లో మంత్రుల బిజీ: గత వారం మౌళి వాక్కం భవనం కుప్పకూలిన కేసు విచారణకు రాగా, అసెంబ్లీలో నివేదిక దాఖలు చేయడం జరుగుతుందని, ఈనెలలోనే అసెంబ్లీ సమావేశం అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది. దీంతో శాఖల వారీగా మంత్రులు సమీక్ష సమావేశాల్లో బిజీ అయ్యారు. గత రెండు రోజులుగా మంత్రులు తమ తమ చాంబర్లలో అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ, బడ్జెట్ కేటాయింపులు, ఇప్పటి వరకు వెచ్చించిన నగదు, చేపట్టిన కార్యక్రమాలపై సమీక్షలు నిర్వహిస్తూ ప్రతి పక్షాలు సంధించే ప్రశ్నల్ని ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతున్నారు.
 
 అదే సమయంలో అసెంబ్లీని ఈనెల 21వ తేదీన సమావేశ పరిచే అవకాశం ఉందని సచివాలయం వర్గాలు పేర్కొంటున్నాయి. తదుపరి అసెంబ్లీ వ్యవహారాల కమిటీ సమావేశంలో సభ ఎన్నిరోజులు నిర్వహించాలోనన్నది నిర్ణయించి, బడ్జెట్ కేటాయింపులపై చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి.  ఓ వైపు అసెంబ్లీని సమావేశ పరిచే రీతిలో ప్రభుత్వం కసరత్తుల్లో మునిగి ఉంటే, మరోవైపు తక్షణం అసెంబ్లీని సమావేశ పరిచేందుకు తమరైనా చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్యకు ప్రతి పక్ష నేత విజయకాంత్ విన్నవించి ఉన్నారు. గవర్నర్‌ను కలుసుకుని వినతి పత్రం సమర్పించి, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఆయనకు వివరించారు.
 
 2
 విక్రమ్, సూర్య, కార్తీలతో మల్టీస్టారర్  చిత్రం
 విక్రమ్, సూర్య, కార్తీ నటించే భారీ మల్టీస్టారర్ చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. ఇది ఒక హాలీవుడ్ చిత్రానికి రీమేక్ అన్నది గమనార్హం. వివరాల్లోకెళితే హాలీవుడ్‌లో వారియర్స్ పేరుతో తెరకెక్కి వసూళ్ల వర్షం కురిపించిన చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్‌లో పునర్‌నిర్మిస్తున్నారు. అక్షయకుమార్, సిద్ధార్ధ్ మల్హోత్రా, జాకీష్రాఫ్ ప్రదాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహిస్తున్నారు.
 
  నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. కాగా ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తమిళంలో విక్రమ్, సూర్య, కార్తీలను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఇక తెలుగులో ప్రభాస్,రామ్‌చరణ్, రాణాలను నటింప జేయడానికి చర్చలు సాగుతున్నట్లు సమాచారం.అత్యంత భారీ బడ్జెట్‌లో రూపిందనున్న ఈ చిత్రానికి శంకర్ లాంటి స్టార్ దర్శకుడిని ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు తెలిసింది.ఇద్దరు సహోదరులు ఒక బాక్సింగ్ శిక్షకుడి ఇతివృత్తంతో రూపొందనున్న ఈ క్రేజీ చిత్రం గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొంచెం రోజులు ఆగాల్సిందే.
 

మరిన్ని వార్తలు