రామ్ కుమార్కు 15రోజులు రిమాండ్

4 Jul, 2016 13:53 IST|Sakshi
రామ్ కుమార్కు 15రోజులు రిమాండ్

చెన్నై : ఇన్ఫోసిస్‌ ఉద్యోగిన స్వాతి హత్యకేసు నిందితుడు రామ్‌ కుమార్‌కు ఎగ్మూర్ కోర్టు 15 రోజుల పాటు  జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కాగా పాళయం కోట్టై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడిని నిన్న అంబులెన్స్లో చెన్నైకి తరలించిన విషయం తెలిసిందే. అతడు ప్రస్తుతం రాయ్పేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.  బ్లేడ్‌తో గొంతు కోసుకున్నందున రామ్ కుమార్కి 18 కుట్లు పడ్డాయి. స్వాతిని తానే హతమార్చినట్టు నేరం అంగీకరిస్తూ  రామ్‌కుమార్‌ ఇప్పటికే పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు.

14వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి గోపీనాథ్ ఇవాళ ఉదయం ఆస్పత్రిలో రామ్ కుమార్ స్టేట్మెంట్ రికార్డు చేశారు. కాగా రామ్ కుమార్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు రాయ్పేట ఆస్పత్రి డీన్ ఎస్ఆర్ రఘునాథన్ తెలిపారు. కాగా తన ప్రేమను తిరస్కరించడమే కాకుండా, కొండముచ్చు(దేవాంగు) వలే ఉన్నావని స్వాతి పదేపదే హేళన చేయడంతో తనలో ఉన్మాది బయటకు వచ్చినట్టు ఈ కేసును విచారిస్తున్న ఐపీఎస్ అధికారి దేవరాజన్ నేతృత్వంలోని విచారణ బృందం ఎదుట రామ్‌కుమార్ వాంగ్ములం ఇచ్చాడు.

మరిన్ని వార్తలు