అమెరికాలో డిప్యూటీ మేయర్‌గా చెన్నై మహిళ

20 Nov, 2017 07:36 IST|Sakshi

టీ.నగర్‌: అమెరికాలో డిప్యూటీ మేయర్‌గా చెన్నైకు చెందిన మహిళ ఎన్నికయ్యారు. చెన్నైకు చెందిన మహిళ షెపాలి రంగనాథన్‌(38) ఈమె అమెరికాలో సీటిల్‌ నగర డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఈమె ఒక స్వచ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. షెపాలి తండ్రిపేరు రంగనాథన్‌. తల్లి పేరు షెరిల్‌. వీరు చెన్నైలో ఉంటున్నారు. ఇలా ఉండగా షెపాలి తన విద్యాభ్యాసాన్ని చెన్నై నుంగంబాక్కంలో గల గుడ్‌షెప్పర్డ్‌ కాన్వెంట్‌లో పూర్తి చేశారు. స్టెల్లా మేరీస్‌ కళాశాలలో బీఎస్సీ జువాలజీ పట్టా పొందారు.

అన్నావర్సిటీలో ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌లో ఉత్తీర్ణులై బంగారు పతకాన్ని పొందారు. 2001లో ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లారు. అంతేకాకుండా షెపాలి రంగనాథన్‌ చెన్నై బోట్‌క్లబ్‌లో నిర్వహించిన అనేక పడవ పోటీల్లో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు