ఉత్సాహంగా బాలల పండుగ

26 Feb, 2015 01:21 IST|Sakshi

బళ్లారి టౌన్: నగరంలోని జోళదరాశి దొడ్డనగౌడ రంగమందిరంలో బుధవారం ధార్వాడ కర్ణాటక బాలవికాస అకాడమీ, బళ్లారి జిల్లా పంచాయతీ, మహిళా శిశు సంక్షేమ శాఖ, విద్యా శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన మక్కళ హబ్బ(బాలల పం డుగ) కార్యక్రమం ఆకట్టుకుంది. జిల్లాలోని తాలూకాకు రెండు బృందాల చొప్పున ఏడు తాలూకాల్లో ఆయా పాఠశాలల వి ద్యార్థులు జానపద కళలకు నృత్యం చేశారు. బాలికలు, బా లుర డోలు నృత్యం, చెవిటి మూగ విద్యార్థుల నృత్యం, లం బాడీ నృత్యం, జానపద నృత్యాలు అలరించాయి. అంతకు ముందు ఈ కార్యక్రమాన్ని జిల్లా పంచాయతీ ఉపాధ్యక్షురాలు మమత జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కలాదగి, తూర్పు బ్లాక్ బీఈఓ వృషభేంద్రయ్య మాట్లాడారు. ఈ రాష్ట్రం జానపద సంస్కృతి, గ్రామీణ క్రీడలకు నిలయమని తెలిపారు. వీటిని ఉత్తేజపరిచి ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బాలల పండుగ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. విద్యార్థులకు వారి వారి తల్లిదండ్రులు ఈ కళలను నేర్పించి, ప్రోత్సహించాలన్నారు. విదేశీ సంస్కృతిపై మోజుతో మనదేశ సంస్కృతిని మరిచి పోకుండా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ మహ్మద్ సలా ఉద్దీన్, జెడ్పీ సామాజిక న్యాయ సమితి అధ్యక్షుడు అన్నదానరెడ్డి, నగర డీఎస్పీ మురుగణ్ణ తదితరులు పాల్గొన్నారు.
 
 

మరిన్ని వార్తలు