బద్వేలు టీడీపీలో భగ్గుమన్న విభేదాలు

30 Nov, 2016 13:02 IST|Sakshi
కడప: వైఎస్సార్‌జిల్లా బద్వేల్ టీడీపీలో మరోమారు విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే జయరాములు చేపట్టిన జన చైతన్య యాత్రను అడ్డుకునేందుకు మరో నేత విజయమ్మ యత్నించారు. ఎమ్మెల్యే బైక్ ర్యాలీ చేయాలనుకున్నరోడ్డుపై జేసీబీతో అడ్డంగా కాల్వ తీశారు. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే జయరాములు, ముందు నుంచి పార్టీలో ఉన్న విజయమ్మ మధ్య కొంతకాలంగా వార్ నడుస్తోంది. నిన్నమొన్నటి వరకు ఒకే గ్రామలో పోటాపోటీగా యాత్రలు చేసిన ఇరువర్గాలు ఇప్పుడు బహిరంగంగా వివాదాలకు దిగుతున్నారు. మున్సిపల్ చైర్మన్ పార్థసారథి ఎమ్మెల్యే యాత్రను అడ్డుకునేందుకు జేసీబీ అడ్డుపెట్టించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి జేసీబీని తొలగించారు
మరిన్ని వార్తలు