ఆనంద రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌

14 Jan, 2017 00:36 IST|Sakshi
ఆనంద రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌

‘సంక్రాంతి సంబరాల’లో సీఎం చంద్రబాబు ఆకాంక్ష

సాక్షి, అమరావతి: ఆదాయం, ఆరోగ్యం, ఆనందంతో ప్రతి మనిషి జీవితంలో సంతోషంగా ఉంటారని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతీ ఒక్కరూ కష్టపడి పనిచేస్తే ఆదాయం వస్తుందని, దానిని ఆనందంగా అనుభవిస్తే ఆరోగ్యం చక్కగా ఉంటుందన్నారు. పండుగ సమయాల్లో పరస్పరం కలసిమెలసి మాట్లాడుకుంటే ఆప్యాయత, అనురాగాలు పెంపొందుతాయన్నారు. మూలాలను మర్చిపోతున్న తరుణంలో వాటిని సజీవంగా ఉంచాల్సిన బాధ్యత అందరిపై ఉందని హితవు పలికారు.

ఆధునిక యుగంలో టెక్నాలజీని వినియోగించుకోవడం ద్వారా జీవితం ఆనందమయంగా ఉంటుందన్నారు. వీటిన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాన్ని ఆనంద రాష్ట్రంగా నిలుపుకుందామని చెప్పారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ అధ్వర్యంలో శుక్రవారం విజయవాడలోని ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన సంక్రాంతి సంబరాల వేడుకలకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

గోలీలు, కర్రా బిళ్లా ఆడిన సీఎం: సంక్రాంతి సంబరాల్లో భాగంగా సీఎం చంద్రబాబు వివిధ గ్రామీణ క్రీడలు ఆడారు. గోలీలు, కర్రా బిళ్ల, బొంగరాలు ఆడారు. గాలి పటాలు ఎగురవేశారు.

మరిన్ని వార్తలు