మద్యం బాటిళ్లలో బొద్దింకలు 

19 Jul, 2020 06:38 IST|Sakshi
మద్యం బాటిళ్లు  

సాక్షి, చెన్నై ‌: టాస్మాక్‌ మద్యం దుకాణాలకు దిగుమతి చేసే మద్యం బాటిల్‌లో బొద్దింకలు, చీమలు ఉంటున్నట్లు టాస్మాక్‌ షాపు ఉద్యోగులు ఫిర్యాదు చేస్తున్నారు. కరోనా వైరస్‌తో ఫ్యాక్టరీలలో 50 శాతం మంది ఉద్యోగులు పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. మద్యం ఫ్యాక్టరీలలో ఉత్పత్తి విభాగంలో పనిచేసే ఉద్యోగుల కొరత కారణంగా మద్యం బాటిళ్లను శుభ్రపరిచే పనులు, వాటి పర్యవేక్షణలో నిర్లక్ష్యం ఏర్పడినట్లు సమాచారం. కొన్ని రోజులుగా టాస్మాక్‌ దుకాణాలకు దిగుమతిచేసే మద్యం బాటిళ్లలో బొద్దింకలు, చీమలతో పాటు ఫంగస్‌ ఉంటున్నట్లు దుకాణాల ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. (ప్రేమకు లాక్‌డౌన్‌ అడ్డంకి.. ఆపై ప్రియురాలి హత్య.. )

దీనిపై కొందరు ఉద్యోగులు మాట్లాడుతూ మద్యం ఉత్పత్తి ఫ్యాక్టరీలలో ప్రొడక్షన్‌ విభాగంలో ఆటోమేటిక్‌ యంత్రాలతో బ్లెండింగ్‌ పూర్తి చేసుకుని లేబుళ్లు అతికించడానికి ఒక నిమి షానికి ముందు 240 బాటిళ్లను 8 మంది ఉద్యోగులు చెక్‌ చేస్తారని, అందులో ఏమైనా ఉంటే బాటిళ్లను తొలగిస్తారని తెలిపారు. ఉద్యోగుల కొరత కారణంగా మద్యం బాటిళ్లను సక్రమంగా పరిశీలించడం లేదని, ప్రస్తుతం టాస్మాక్‌ దుకాణాలకు దిగుమతి చేసే మద్యం బాటిళ్లలో ఈ విధంగా క్రిమి కీటకాదులు ఉంటున్నట్లు తెలిపారు

మరిన్ని వార్తలు