కనికరం లేని కండక్టర్‌

30 Nov, 2017 08:00 IST|Sakshi

బస్‌పాస్‌ చెల్లదని బస్సు నుంచి దింపివేత

తిరువొత్తియూరు: ఉచిత బస్‌పాస్‌ చెల్లదని కంటి చూపు లేని విద్యార్థిని మార్గమధ్యలో బస్సు నుంచి కిందకు దింపేశాడు ఓ కండక్టర్‌. కడలూరు జిల్లా విరుదాచలంకు చెందిన మాయవేల్‌ (20) కంటిచూపు లేని విద్యార్థి. ఇతను విల్లుపురం లా కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఇతను దివ్యాంగులకు ప్రభుత్వం ఇచ్చే ఉచిత బస్‌పాస్‌తో కళాశాలకు బస్సు తో వెళ్లి వస్తుంటాడు. మంగళవారం బన్‌రూటి నుంచి విల్లుపురానికి రావడానికి ప్రభుత్వ బస్సు ఎక్కాడు. బస్సు కదలిన కొద్ది సమయానికి కండక్టర్‌ మాయవేల్‌ను టికెట్‌ తీసుకోమని కోరాడు.

అతను ఉచిత బస్సు పాస్‌ను కండక్టర్‌ చేతికి ఇచ్చాడు. అది చూసిన కండక్టర్‌ అది చెల్లదని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడింది. దీంతో ఆగ్రహం చెందిన కండక్టర్‌ మాయవేల్‌ను మార్గమధ్యలో బస్సు నుంచి కిందకు దింపేశాడు. దీనిపై ఫిర్యాదు ఇవ్వడానికి మాయవేల్‌ విల్లుపురం జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ కలెక్టర్‌ను కలవడానికి వీలుకాకపోవడంతో విల్లుపురం బస్‌డిపో జనరల్‌ మేనేజర్‌ వద్ద కండక్టర్‌పై ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదును స్వీకరించిన అధికారులు దీనిపై విచారణ చేస్తామని అతనికి హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు